రాజకీయ నాయకులు - మంత్రులు - ఎమ్మెల్యేలు.. వీరంతా కూడా తమ నియోజకవర్గం ప్రజలకో లేదా తమ రాష్ట్ర ప్రజలకో ఆదర్శంగా ఉండాల్సీన ప్రజాప్రతినిధులు.. కాని మన దేశంలో మాత్రం అది కుదరదు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ప్రభుత్వ అధికారులు తొత్తులుగా ఉండాలి.. లేకపోతే తమ అధికారాన్ని చూపించే వారిపై ప్రతికార చర్యలకు పాలుపడడం పరిపాటే.. ఇదంతా ఎందుకంటే తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ కోవాకే చెందుతారు కాబట్టి. ఇంతకీ విషయమేమిటంటే... తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసారన్న నెపంతో కొంతమంది ఐఏస్ - ఐపీఎస్ అధికారులపై తన ప్రతాపం చూపించేందుకు కేసీఆర్ రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ మందస్తు ఎన్నికలలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని ఊహించి ఆ పార్టీ తరఫున పనిచేసినట్లు చెబుతున్న 8 మంది ఐఏస్ అధికారులను - ఏడుగురి ఐపీఎస్ అధికారు లపై చర్యలకు తెరాస అధిష్టానం సిద్దపడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అభ్యర్దులకు అనుకూలంగా కొంత మంది ఐఏస్, ఐపీఎస్ అధికారులు పనిచేసారని చెబుతున్నారు. పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహా - మల్లు బట్టి విక్రమార్క - రేవంత్ రెడ్డి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి - డికె. అరుణ - గీతా రెడ్డి వంటి నాయకులకు అనుకూలంగా పనిచేసి, వీరు కనుక అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్నత పదవులు కోసం హామీలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొంత మంది తమకు అనుకూలంగా పనిచేసిన ఐఏస్, ఐపీఎస్ అధికారులకు ఉన్నత పదవులు ఇస్తామని వాగ్దానం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫలితాలు తారు మారు అయ్యి అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం మనకు తెలిసిందే. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సదరు అధికారులపై ఆగ్రహంగా ఉన్నారని వినికిడి. తన పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులను శిక్షించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వీరికి పెద్దగా గుర్తింపు లేని శాఖలకు పంపాలని కేసీఆర్ నిర్ణయంగా మారుతోంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులను శిక్షించేదా.. ఎమో అధికారుల కంటే కూడా అధికారమే కదా బలం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదైన అధికారం ముందు ఐఏస్ అయినా ఐపీఎస్ అయిన కూడా వెలవెల పోతోంది కదా...