ఎండిపోయిన గోదావరి....మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంతవరకు సుమారు 150 కిలోమీటర్ల వరకు గోదావరి నది అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సజీవంగా ఉన్న గోదావరిని చూసి తన మనసు పులకిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మేడిగడ్డ - సుందిళ్ల జలాశయాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టులను కేసీఆర్ పరిశీలించారు. ఆ తర్వాత ధర్మపురి చేరుకుని శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయని - నెలకు 60 టీఎంసీల చొప్పున 6 నెలలపాటు నీటిని ఎత్తిపోస్తామని - రామగుండం నుంచి అదనంగా 4 వేల మెగావాట్ల కరెంట్ వస్తుందని చెప్పారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ప్రతీ రోజు 3 టీఎంసీల నీళ్లు వస్తయన్నారు. అటు ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు ప్రతీరోజు 2 టీఎంసీల నీళ్లు వస్తాయని అన్నారు. అయితే గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో వెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం 20-25 ఏళ్ళు పట్టేదని అన్నారు. 44 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డుల ఆధారంగా కాళేశ్వరం రీడిజైనింగ్ చేశామని చెప్పారు.
అలాగే తుపాకులగూడెం - సీతారామ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేసుకున్నామని.. అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని సీఎం చెప్పారు. మిషన్ భగీరథ అద్భుత ఫలితాన్ని ఇచ్చిందని - బంజారాహిల్స్ - జూబ్లీహిల్స్ లో ఉన్నవారికి అందిస్తున్న నీటినే..పేదల బస్తీల్లో కూడా అందిస్తున్నామని చెప్పారు.
ఇక సంక్షేమ పథకాలు అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు. దివ్యాంగులకు రూ.3,116 పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని - కేసీఆర్ కిట్ - కల్యాణ లక్ష్మి - వంటి ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే రైతుబంధు - రైతు బీమా పథకాలు దేశం ఆశ్చర్యపోయేలా అమలు చేస్తున్నామన్నారు. పలు రాష్ట్రాలు కూడా సంక్షేమ విషయంలో తెలంగాణని అనుసరిస్తున్నాయని చెప్పారు. ఒడిశా సీఎం నవిన్ పట్నాయక్ కూడా రైతుబంధు పథకాన్ని ప్రశంసించారని....ఈ పథకాన్ని కాపీ కొట్టి ఒడిశాలో కూడా అమలు చేస్తున్నారని తెలిపారు.