అప్పటివరకూ స్తబ్దుగా ఉన్నట్లుగా ఉండే కేసీఆర్.. ఒక్కసారి విరుచుకుపడతారు. ప్రత్యర్థులు ఏమాత్రం ఊహించలేని రీతిలో నిర్ణయాలు తీసుకోవటం ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయన దూకుడును అంచనా వేయటానికి కూడా ఒకపట్టాన మింగుడుపడని రీతిలో ఆయన నిర్ణయాలు ఉంటాయి. కొద్దికాలంగా తాను చెబుతున్న మైనార్టీ..ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బిల్లు నేపథ్యంలో.. అంతకు ముందే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవటం ద్వారా.. ప్రభుత్వ కమిట్ మెంట్ ను కేసీఆర్ స్పష్టం చేశారని చెప్పాలి. క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడటం ద్వారా.. రిజర్వేషన్ల మీద ప్రజలకున్న అనుమానాల్ని.. సందేహాల్ని తీర్చే ప్రయత్నంతో పాటు.. బీజేపీకి కౌంటర్ ఇచ్చేలా ఆయన మాటలున్నాయని చెప్పాలి.
తాజాగా నిర్వహించిన క్యాబినెట్ భేటీలో ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన కీలక నిర్ణయంతో పాటు.. మరికొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. ఈ వారాంతంలో ముస్లిం.. ఎస్టీల రిజర్వేషన్లు పెంచేందుకు వీలుగా నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశ అవసరాన్ని వివరంగా వెల్లడించే ప్రయత్నం చేసిన కేసీఆర్.. తాము మత రిజర్వేషన్లు ఇవ్వటం లేదని.. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతున్నామని చెప్పటం ద్వారా.. విపక్ష బీజేపీ చేస్తున్న ప్రచారానికి బ్రేకులు వేయాలని భావిస్తున్నట్లుగా చెప్పొచ్చు.
తాము ఇవ్వనున్న రిజర్వేషన్లు కొత్తవి కావని.. ఏపీ.. తెలంగాణ రెండురాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్నదేనని.. జస్ట్ కొంత శాతాన్ని పెంచుతున్నట్లుగా చెప్పిన కేసీఆర్.. మిగిలిన రాష్ట్రాల్లో తాము పెంచే దాని కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తున్న విషయాన్ని ఉదాహరణసహితంగా వెల్లడించటం గమనార్హం.
తమిళనాడులో 69 శాతం.. జార్ఖండ్‌లో 60.. మహారాష్ట్రలో 52.. అరుణాచల్‌ప్రదేశ్.. మేఘాలయ.. నాగాలాండ్.. మిజోరాంలో 80శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయన్న కేసీఆర్.. గుజ్జర్లు - జాట్లకు 68శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం తీర్మానించిన విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. తమిళనాడులో 32 సంవత్సరాలుగా 69 శాతం రిజర్వేషన్లు ఉన్న విషయాన్ని చెప్పటం ద్వారా తాము పెంచాలని భావిస్తున్న రిజర్వేషన్లుపెద్ద విషయమే కాదన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేశారు.
తెలంగాణ సామాజిక స్వరూపానికి తగ్గట్లుగా తాము రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని స్పష్టం చేసిన కేసీఆర్.. క్యాబినెట్ లో తాము తీసుకున్న పలు నిర్ణయాల్ని వెల్లడించారు.
= రాష్ట్ర హెరిటేజ్ యాక్టును తీసుకురావాలన్న నిర్ణయం
= గతంలో గవర్నర్ ఎమ్మెల్సీ కోటా కింద పనిచేసిన బి.రాజేశ్వరరావు, ఫరూఖ్‌ను తిరిగి మరోసారి నియమించాలన్న డెసిషన్
= రైతులపై ఉన్న లక్ష రూపాయిల రుణభారం తగ్గించాం
= ఉద్యమ సమయంలో రిజర్వేషన్ల మీద ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేస్తాం
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/