ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ వేడుకలు మొదలు కానున్నాయి. ఈ మహాసభలను నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వంలో ఉన్న టీఆరెస్ పార్టీ - ఆ పార్టీతో మంచి సంబంధాలు నెరపిన సంస్థలు గతంలో ప్రత్యేక రాష్ర్టం కోసం ఉద్యమించిన సమయంలో చేసిన వ్యాఖ్యలు - చేసిన పనులు ఇప్పుడు చర్చనీయమవుతున్నాయి. పలువురు గతంలో తెలుగును తూలనాడారన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘తెలుగుతల్లి’ అంశం అంతటా ప్రస్తావనకొస్తోంది. అసలు.. ప్రపంచ మహాసభ ల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలుగు తల్లిని స్మరిస్తుందా లేదా.. ‘మా తెలుగు తల్లికి ’ గీతాన్ని ఆలపిస్తుందా లేదా అన్న అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో భాషలు వేరయినా - ప్రాంతాలు వేరైనా - కులాలు.. మతాలు వేరైనా... ఆస్తికులైనా - నాస్తికులైనా దేశాన్ని ప్రతిబింబించే భరతమాతను గౌరవిస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలా చేస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇదేసమయంలో గతంలో జరిగిన ఉదంతాలనూ కొందరు గుర్తు చేస్తున్నారు. 'తెలుగు తల్లి.. ఎవడికి తల్లి.?' అంటూ తెలంగాణ ఉద్యమం సమయంలో కొందరు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం... ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంధ్రప్రాంత తెలుగు ప్రముఖులు - తెలుగు దిగ్గజ సాహితీకారుల విగ్రహాలను కూల్చడాన్నీ గుర్తు చేస్తున్నారు.
యాసలు వేరైనా భాష ఒక్కటే కాబట్టి తెలంగాణ ప్రభుత్వం, అందులోనూ ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ స్వయంగా భాషాభిమాని కావడంతో ఆయన ఎక్కడా వివాదానికి తావివ్వని రీతిలో వ్యవహరిస్తారని అత్యధికులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంగా తెలంగాణ యాసకి పట్టం కట్టినా ప్రపంచ సభల వేదికగా తెలంగాణ వేరు, తెలుగు వేరన్న భావన రానివ్వరనే అనుకుంటున్నారు. జయహే జయహే తెలంగాణ అని పాడినా దాంతో పాటు మా తెలుగు తల్లి గీతం కూడా వినిపిస్తుందని తెలంగాణకు చెందిన కొందరు కవులు సూచన ప్రాయంగా చెబుతున్నారు.