ప్రాంతాలు వేరైనా మాట్లాడుకునే భాష ఒక్కటే. కలిసి ఉండి విడిపోయినట్లుగా ఉండే కన్నా.. విడిపోయి కలిసి ఉందామన్న మాటను తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో తియ్య తియ్యగా చెప్పిన మాటలకు చేతలకు మధ్య అంతరం ఎంతన్నది తాజాగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
మహాసభల ముందు కనిపించే తెలుగు పదానికి భిన్నంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఒక భాషకు పండగ అంటే.. ఆ భాష మాట్లాడే వారదరికి పండగలా ఉండాలే కానీ.. ఆ భాష మాట్లాడే ఒక రాష్ట్రానికి మాత్రమే పండగలా ఉంటే దానికి వచ్చే ఆదరణ అంతంత మాత్రమే.
ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న మహాసభలు తెలుగు వారంతా ఒక్కటేనన్న స్ఫూర్తిని ఇవ్వాలే తప్ప.. మీరు వేరు.. మేమే వేరు అన్న ఫీలింగ్ తెచ్చేలా ఉండకూడదు. రాజకీయంగా ఇలాంటి వాటి వల్ల కలిగే ప్రయోజనం ఎంతోకొంత ఉన్నా.. ఒకే జాతికి చెందిన వారు నిలువుగా చీలిపోవటానికి.. మేం వేరు.. మీరు వేరు అన్న భావన కలిగేలా చేయటానికి ఈ మహాసభలు పెద్ద ముద్రే వేస్తాయని చెప్పాలి.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరికి అవకాశం ఇవ్వటం ద్వారా ఒక మంచి సంప్రదాయానికి తెర తీశారు. ఈ పదవి కేటాయింపు వెనుక రాజకీయ కోణం ఎంతోకొంత ఉన్నప్పటికీ.. సాటి రాష్ట్రంలోని తమ వారికి ఎంతో ప్రాధాన్యత ఉందన్న భావన కలుగజేశారు. తాజాగా మహాసభల్లో మాత్రం ఇది కనిపించదు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సభల నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలా స్పష్టంగా ఉన్నారని.. వేదిక మొదలు ఈ కార్యక్రమం మొత్తమ్మీదా ఎక్కడా ఆంధ్రా వాసన అన్నది కనిపించకూడదన్న ఆదేశాల్ని స్పష్టంగా ఇచ్చారని చెబుతున్నారు. తెలుగు మహాసభల ముఖ్యోద్దేశం తెలంగాణను ప్రమోట్ చేయటమే తప్పించి వేరే ఏమీ లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లే ఆహ్వానాల దగ్గర నుంచి.. వసతి ఏర్పాటు విషయంలో వేరే దేశాల నుంచి.. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఎలాంటి రూల్స్ అమలు అవుతాయో.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే వారికి అవే రూల్స్ అప్లై అవుతాయన్నట్లుగా ఉంచారు. తాజా తీరుతో ఆంధ్రా మిగిలిన రాష్ట్రాల మాదిరే తప్పించి.. ఎలాంటి ప్రత్యేకత లేదన్న విషయాన్ని తేల్చి చెప్పేశారని చెబుతున్నారు.