మోడీని ఐస్ చేసేసిన కేసీఆర్‌!

Update: 2016-08-21 09:23 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతోందా? ప‌్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని న‌చ్చే విధంగా తెలంగాణ సీఎం అడుగులు వేస్తున్నారా? స‌మ‌రం ద‌శ నుంచి సంధికి సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే తాజాగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు విశ్లేషిస్తే అవున‌నే స‌మాధానం వ‌స్తోందని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జీఎస్‌ టి బిల్లును ఆమోదించేందుకు తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సమావేశాలనే వర్షాకాల శాసనసభ సమావేశాలుగా కొనసాగిస్తామన్నారు. జీఎస్‌ టీ బిల్లుకు దేశంలోని 50 శాతంపైగా రాష్ట్ర శాసనసభలు ఆమోదం తెలపాల్సి ఉన్న నేప‌థ్యంలో జీఎస్‌ టికి తెలంగాణ మద్ధతు ఇస్తున్నందున ప్రత్యేకంగా శాసనసభా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు. 2016 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రత్యేక సమావేశం ఉంటుందని ఇందుకోసం గవర్నర్ - స్పీకర్‌ తో మాట్లాడామ‌ని కేసీఆర్ చెప్పారు. వర్షాకాలం సమావేశాలుగా కూడా వీటినే కొనసాగిస్తామని ఆయ‌న వివ‌రించారు.

ఇదిలా ఉండ‌గా కీల‌క‌మైన హైకోర్టు విభజన విష‌యంలోనూ కేసీఆర్ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌త్యేక‌ హైకోర్టు ఏర్పాటు విష‌యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హామీ ఇచ్చారని, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా హామీ ఇచ్చారని కేసీఆర్ చెప్పారు.  ఈనేప‌థ్యంలో హైకోర్టు విభజన కోసం ఢిల్లీలో ధర్నా చేయడాన్ని విరమించుకున్నానని కేసీఆర్ వివ‌రించారు. అయితే తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి వెళతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోణంలోనే కేంద్ర రాష్ట్ర సంబంధాలే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్ర స‌ర్కారుల‌తో క‌లిసి న‌డవ‌డం ఉంటుంద‌ని కేసీఆర్ చెప్పారు.
Tags:    

Similar News