తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజ్యసభ ఎంపీ పదవులకు సంబంధించిన చర్చోపచర్చలు మొదలయ్యాయి. వచ్చే నెలాఖరులోగా ఎమ్మెల్యేల కోటాలో వచ్చే రెండు రాజ్యసభ పదవులకు తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అధికార పార్టీ తెరాసకు శాసనసభలో తిరుగులేని మెజారిటీ ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు సీట్లు కూడా వారికి మాత్రమే దక్కుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఆ పార్టీలోనే ఆరెండు సీట్లు దక్కించుకోవడం గురించి మ్యూజికల్ ఛెయిర్స్ ఆట నడుస్తున్నది. కేసీఆర్ సర్కారు గద్దె ఎక్కిన నాటినుంచి దొరల సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారనే అపప్రధను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే దాన్ని గురించి ఆయన పెద్దగా ఖాతరు చేయడం లేదు. ఇప్పుడు పార్టీకి దక్కబోతున్న ఈ రెండు రాజ్యసభ ఎంపీ సీట్ల విషయంలో కూడా ఆయన దొరలకు చోటు కల్పిస్తారనడంలో సందేహం లేదు. కాకపోతే.. ఉన్న రెండు సీట్ల కోసం ముగ్గురు దొరలు మ్యూజికల్ ఛెయిర్స్ ఆడుతుండడమే చిత్రం.
రెండూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు. అలాంటప్పుడు ఒక సీటును దొరలకు ఇచ్చి,మరో సీటును ఇతర సామాజిక వర్గాల వారికి కేటాయించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా తెరాస అధినేత కొన్ని కాంబినేషన్లు పరిశీలిస్తున్నారు. కానీ పార్టీలో అభిజ్ఞ వర్గాల నుంచి వస్తున్న వార్తలను బట్టి.. కేసీఆర్ మీద దొరల వర్గం నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది.
వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ కు చెందిన వీహనుమంతరావు - ప్రస్తుతం తెరాసలోనే ఉన్న గుండు సుధారాణి ల పదవీకాలం జూన్ 21 నాటికి పూర్తి కావడం వలన రెండు ఖాళీలు వస్తున్నాయి. గుండు సుధారాణి కేసీఆర్ ను కోరుతున్నారు గానీ.. ఆమెకు మళ్లీ ఛాన్స్ ఆయన ఇవ్వకపోవచ్చు. ఈ రెండు స్థానాలకు తెరాసలో దొరల వర్గం నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు - నమస్తే తెలంగాణ వ్యవస్థాపకుడు సీఎల్ రాజం - పార్టీ విధాన కర్తల్లో ఒకరుగా కీలక వ్యక్తిగా పేరున్న కేసీఆర్ ఫ్రెండ్ దివకొండ దామోదర్ రావు ముగ్గురూ పదవిని ఆశిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి తప్ప అవకాశం ఇవ్వలేని నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలనేది కేసీఆర్ కు కత్తి మీద సామే అని చెప్పక తప్పదు. రెండో సీటుకు మైనారిటీలను లేదా దళితులను ఎంపిక చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వర్గాలను సంతృప్తి పరచడం లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అయితే ముగ్గురు దొరల్లో రెండు కుర్చీలను ఇద్దరు దక్కించుకుంటారా? ఒక్కరే ఒక్కకుర్చీకే పరిమితం అవుతారా అనేదానిని బట్టే.. మిగిలిన రాజకీయాలు ఆధారపడి ఉంటాయని అంతా అంటున్నారు.