తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు - నిధులు - నియామకాల కోసం జరిగిందని, ప్రత్యేక రాష్ట్రం అనంతరం రెండు ఆకాంక్షలు నెరవేరాయని, ప్రస్తుతం నీళ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసన సభలో జల విధానంపై ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక అనేక అంశాలతో పాటు అత్యంత ప్రాధాన్యమైన ఇరిగేషన్ పైనా దృష్టి పెట్టామని అన్నారు. గతంలో ఆర్డీఎస్ లో జరిగిన అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా అడ్డుకున్నామని చెప్పారు. ఎన్నో ఒడిదుడుకులు - పోరాటాలు - ఆత్మత్యాగాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైందన్నారు. ఇప్పటి వరకు నిధులు - నియామకాలకు సంబంధించి సమస్య చాలా వరకు తీరిందన్నారు. మిగిలింది నీళ్ల పరిష్కారమేనని పేర్కొన్నారు. నీటి సమస్య పరిష్కారానికి జల విధానం ద్వారా స్వస్తి పలుకుతామన్నారు. తెలంగాణ ఏర్పడంతోనే వనరుల సమస్య చాలా వరకు తీరిందన్నారు.
తెలంగాణ జల విధానంపై రాష్ట్ర రైతాంగమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎక్కడికి పోయినా సాగు - తాగు నీరు గురించే అడుగుతున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉండేదన్నారు. దుర్భర పరిస్థితికి చెక్‌పెట్టడానికి కొత్త జలవిధానాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణకు నీళ్లు ఎలా వస్తాయి? ఏయే ప్రాజెక్టులు కడుతారు? సాగు నీటి ప్రాజెక్టులపై ప్రజలంతా ఆత్రుత్రగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. అత్యంత ప్రధానమైన ఇరిగేషన్ కు సంబంధించి పలు ధపాలుగా సమీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు కలగకుండా ప్రాజెక్టుల రూపకల్పన చేయబోతున్నామని చెప్పారు.
కాగా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను - స్పీచ్ ను మొత్తం శాసన సభ రికార్డుల్లో నమోదు చేయాలని ఆయన స్పీకర్ ను కోరారు. అంతేకాకుండా... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరువాత కూడా ఆ వివరాలు మరోసారి చూసుకునేందుకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేందుకు సభ్యులందరికీ పెన్ డ్రైవ్ ల్లో ఆ వివరాలు ఇచ్చారు.