కేసీఆర్ చెత్తాభిషేకం

Update: 2015-08-05 16:47 GMT
నిర‌స‌న బ‌హురూపం. చెప్పుల దండ వేయ‌వ‌చ్చు. పాల‌భిషేకం చేయ‌వ‌చ్చు. ఇంకా క‌డుపు మండితే చెత్తాభిషేక‌మూ చేయ‌వ‌చ్చు. స‌రిగ్గా ఇదే ప‌నిచేశారు తెలంగాణ పారిశుద్ధ్య కార్మికులు. గ‌త కొద్ది రోజులుగా స‌మ్మె చేస్తున్నా ఏమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోన్న టీ-స‌ర్కార్ తీరుపై మండిప‌డుతూ.. రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ లో మున్సిప‌ల్ కార్మికులు కేసీఆర్ చిత్ర‌ప‌టాన్ని చెత్త‌తో అభిషేకించి వినూత్న రీతిలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

త‌మ డిమాండ్లు ప‌రిష్క‌రించ‌కుంటే స‌మ్మెను మ‌రింత ఉద్ధృతం చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. అంతా నా ఇష్టం.. నేను చెప్పిందే వేదం అన్న‌ట్లు కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఇదేమంత స‌బ‌బు కాద‌ని, ఎన్నిక‌ల వ‌ర‌కూ ఓటు బ్యాంకు రాజ‌కీయాలు నెర‌పి, త‌రువాత త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న చెందారు.  ఇప్ప‌టికైనా త‌మకు న్యాయం చేయాల‌ని వీరంతా కోరుతున్నారు. ఇక కేసీఆర్ కూడా ఓన్లీ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో పారిశుధ్య కార్మికుల‌కు మాత్ర‌మే జీతాలు పెంచి మిగిలిన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్మికుల స‌మ్మెను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.
Tags:    

Similar News