తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల కసరత్తులో సినిమాటిక్ సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఖరి ఇప్పటికే ఇదే తీరు కనిపించిన విషయాన్ని మర్చిపోకూడదు. తొలుత 15 కొత్త జిల్లాలకు ఓకే చెప్పేసిన ఆయన ఆ తర్వాత మరో రెండు కొత్త జిల్లాల్ని తెరపైకి తీసుకురావటం.. ఈ రెండు జిల్లాల్ని ఎవరూ డిమాండ్ చేయకున్నా.. కొత్త జిల్లాలుగా ప్రకటించటం తెలిసిందే. అడగని ప్రాంతాల్ని జిల్లాలుగా చేస్తున్న కేసీఆర్.. తమ ప్రాంతాలకు కొత్త జిల్లాలు ఇవ్వాలంటూ ఆయా ప్రాంతాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తూ.. నిరసన దీక్షలు చేస్తున్నా తెలంగాణ సర్కారు మాత్రం లైట్ తీసుకునే పరిస్థితి.
తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త జిల్లాల ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాలపై వారికున్న అభ్యంతరాల్ని స్వీకరిస్తున్న ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా వినతలు వచ్చి పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. పక్కపక్కనే ఉండే వరంగల్.. హన్మకొండను రెండు వేర్వేరు జిల్లాలుగా చేయటం వల్ల నష్టమే తప్పించి ఎలాంటి లాభం ఉండదన్న విషయాన్ని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
చారిత్రక నేపథ్యాన్ని పక్కన పెట్టి.. వరంగల్.. హన్మకొండను రెండు వేర్వేరు జిల్లాలుగా చేయటం ఏ మాత్రం సరికాదన్న భావనపై పార్టీలు మాత్రమే కాదు ఇంటెలిజెన్స్ నివేదికలు సైతం స్పష్టం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. వరంగల్ జిల్లాను వరంగల్.. హన్మకొండ.. భూపాల పల్లి.. మహబూబాబాద్ అంటూ నాలుగు జిల్లాలుగా మార్చాలని కేసీఆర్ సర్కారు భావిస్తున్నారు. మిగిలిన జిల్లాలపై పెద్దగా అభ్యంతరాలు లేనప్పటికీ.. హన్మకొండ జిల్లాపైనే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావటంతో పాటు ప్రజా వ్యతిరేకత పెల్లుబికుతోంది. మరోవైపు.. పరకాల జిల్లా డిమాండ్ ను టీఆర్ ఎస్ సర్కారు పట్టించుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా.. వరంగల్.. కాజీపేట.. హన్మకొండ మూడు ఒకే జిల్లాలో ఉండాలన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ డిమాండ్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ అంశంపై తాజాగా దృష్టి సారించటం గమనార్హం. ఆదివారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ ఈ అంశంపై ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం వెల్లువెత్తుతున్న డిమాండ్లకు తలొగ్గితే చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలన్న స్ఫూర్తికే విఘాతం కలుగుతుందన్న భావనను కేసీఆర్ వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. వరంగల్ లో 30 మండలాలు.. 23 లక్షలకు పైగా జనాభా ఉన్న నేపథ్యంలో.. ఇదో పెద్ద జిల్లాగా మారుతుందన్న అభిప్రాయం కేసీఆర్ కు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో హన్మకొండ జిల్లాపై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించే దిశగా టీఆర్ ఎస్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక రాజీ ఫార్ములాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న హన్మకొండను కొత్త జిల్లా కింద మినహాయించి.. ఆ పేరిట ఏర్పాటు చేస్తున్న జిల్లాకు వరంగల్ రూరల్ అన్న పేరు పెట్టటంతో పాటు.. హన్మకొండ కింద ఉన్న మండలాల్ని యథాతధంగా ఉంచేస్తారని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో హన్మకొండను వరంగల్ జిల్లాలో కంటిన్యూ చేసే అవకాశం ఉందన్న అంచనా వ్యక్తమవుతోంది. మరికొత్త జిల్లాకు ఏం పేరు పెడతారన్న అంశంపై ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాకతీయ జిల్లా లేదంటే భద్రకాళి జిల్లా పేరును పెట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. ప్రభుత్వం అనుకున్నది జరగటంతో పాటు.. ప్రజలు కోరుకున్నది పూర్తి అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.