తెలంగాణ రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టి రెండేళ్లు కావస్తున్న సమయంలో కార్యకర్తలకు న్యాయం చేసేందుకు గులాబీదళపతి, సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. టీఆర్ ఎస్ నేతలు ఎంతో కాలంగా ఆతృతగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీచేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుండి సంకేతాలు అందుతున్నాయి. తొలి విడతలో 14 స్టేట్ కార్పోరేషన్ లకు పాలక వర్గాలను ఎంపిక చేయాలని కేసీఆర్ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో బిజీబిజీగా ఉన్నప్పటకి ఈ సమావేశాలు ముగిసేలోగానే కార్పోరేషన్ పాలకవర్గాలను ఎంపిక చేయాలని పట్టుదలతో కేసీఆర్ ఉన్నారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మద్య కొన్ని కార్పోరేషన్లలలో విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. వీటిని సాద్యమయినంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కార్పోరేషన్లకు పదవుల ఆశావాహుల జాబితాను అందించాలని నేతలను కేసీఆర్ నేతలను ఆదేశించినట్లు సమాచారం. ప్రతి కార్పోరేషన్ లోను ఐదుగురికి తగ్గకుండా డైరెక్టర్లు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలోను నామినెటెడ్ పదవులకు సంబందించి ఎస్సీ - ఎస్టీ - బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది.
సహయ మంత్రి హోదాతో ఉండే పార్లమెంటరీ సెక్రటరీ పదవులను దక్కించుకొని కోర్టు కేసుల ద్వారా వాటిని కోల్పోయిన ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ - వొడితల సతీశ్ కుమార్ - జలగం వెంకట్రావు - గ్యాదరి కిషోర్ కుమార్ - కోవా లక్ష్మిలకు క్యాబినెట్ హోదాతో కూడిన కార్పోరేషన్ పదవులు గ్యారెంటీ అని టీఆర్ ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాస్యం వినయ్ భాస్కర్ కు ఆర్టీసీ చైర్మన్ లేదా మైనింగ్ కార్పో రేషన్ లను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కోవాలక్ష్మికి ట్రైకార్ ఛైర్మన్ పదవి వరించనుందని సమాచారం. సివిల్ సప్లయిస్ - టిఎస్ పిఐఐఎస్ లాంటి కీలకమయిన పదవులలో కేసీఆర్ తన అంతరింగిక ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి రంగం సిద్దం చేశారని గులాబీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక జిల్లా స్థాయిలో ఉండే నామినేటెడ్ చైర్మన్ ల భర్తీ కోసం జిల్లా మంత్రి చైర్మన్ గా కమిటిని ఏర్పాటు చేసేందుకు సర్కారు సుముఖంగా ఉంది. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ ఆలయ కమిటీ - కాళేశ్వరం - నల్గొండ జిల్లాలోని యాదగిరి లక్ష్మినర్సింహస్వామి - ఖమ్మంలోని భద్రాచలం - వరంగల్ లోని కొముర వెల్లి ఆలయం - ఐనవోలుతో పాటు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ల పాలక మండలి వంటి కీలక పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 62 మార్కెట్ కమిటీలు - 90 దేవాదాయ కమిటీలకు పాలక మండళ్లు ఏర్పాటు కావాల్సి ఉంది. ఇప్పటికే వీటికి సంబందించి రిజర్వేషన్లు కూడ ఖరారయ్యాయి. దీంతో ఆయా నియోజకవర్గాలలో ఉన్న నామినెటెడ్ పదవుల లో ఎమ్మెల్యేల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ముఖ్యనేతలతో జిల్లా స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఆయా కమిటీలకు జిల్లాలకు చెందిన మంత్రులు ఛైర్మన్ లుగా ఉండాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ ఉద్యమంలో కలసి పనిచేసిన వారితో పాటు ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారిని సమన్వయం చేసుకుంటూ పదవుల భర్తీ చేయాలని కేసీఆర్ ఆలోచనగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మొత్తంగా దాదాపు రెండేళ్ల తర్వాత వస్తున్న శుభసందర్భంలో తాము సైతం భాగస్వామ్యులం కావాలని గులాబీ నేతలు ఆశపడుతున్నారు. ఇటు బడా నేతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు అటు తెలంగాణభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.