తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను పట్టిన పట్టు వదిలేది లేదంటూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. వాస్తుపరంగా ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనం బాగులేదని భావిస్తోన్న కేసీఆర్ సర్కార్ సచివాలయం కూల్చి కొత్త నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కోర్టు సమస్యలు - వివాదాలు ఎదురయ్యాయి. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా సరే.. సచివాలయ తరలింపు, కొత్త భవనాల నిర్మాణంలో ముందుకే వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందనేది తాజావార్త.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ సర్కారు ఈనెల 14న (కార్తీక పౌర్ణమి..సోమవారం) కొత్త సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని సంకల్పించింది. ఆ తర్వాత కోర్టులో కేసులు తేలాక పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టాలనుకుంటోంది. మొదటి దశలో ఏ - బీ -సీ బ్లాకులను - ఆ తర్వాత డీ బ్లాకును కూలగొట్టాలని నిర్ణయించారు. ఆ లోగా ఏపీ సచివాలయ ఆధీనంలోని భవనాలు కూడా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే 24 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని చదును చేసి 380 కోట్ల వ్యయంతో కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/