ఇంటికి వచ్చిన అతిధులకు ఉన్నంతలో ఏదో ఒక బహుమతి ఇచ్చి పంపే సంప్రదాయం మనకు ఎక్కువే. బొట్టు పెట్టి పండు చేతిలో పెట్టటమో.. పసుపు కుంకుమ కింద రవికె ముక్క ఇవ్వటం మామూలే. మరి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆమెకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏం ఇవ్వనున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవాంక టూర్ సందర్భంగా ఆమెకు ఇవ్వాల్సిన బహుమతుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. ఆమెకు ఇచ్చే విందు సందర్భంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పసందైన విందును ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం కింద ఒక గిప్ట్ బాక్స్ ను ఇవ్వనున్నారు.
గతంలో హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా ప్రముఖులకు చార్మినార్ మెమొంటోను బహుమతిగా ఇచ్చేవారు. బిల్ క్లింటన్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు చంద్రబాబు.. జార్జ్ బుష్ వచ్చినప్పుడు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు చార్మినార్ మెమొంటోను ఇచ్చేవారు. తాజాగా ట్రంప్ కుమార్తె ఇవాంక విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే రూల్‌ను ఫాలో కానున్నారు. అయితే.. పాత సంప్రదాయానికి తనదైన మర్యాదను జోడించనున్నారు.
గతంలో ఇచ్చినట్లుగా చార్మినార్ మెమొంటోతో పాటు.. ప్రత్యేకంగా నేయించిన చీరను ఆమెకు బహుమతిగా ఇవ్వనున్నారు. ఆమెకు ప్రత్యేకమైన గిఫ్ట్ బాక్స్ ను ఇవ్వనున్నారు.
ఇందులో హైదరాబాద్ స్వర్ణకారులు ప్రత్యేకంగా రూపొందించిన బంగారు నగలు.. గద్వాల్.. సిరిసిల్ల.. సిద్దిపేటకు చెందిన నేతన్నలు తయారు చేసిన చేనేత చీరలను ఉంచనున్నారు. ఇవాంకకు ఇచ్చే బహుమతి పెట్టెలో ఇచ్చే బహుమతులన్నింటిని కేసీఆర్ స్వయంగా ఎంపిక చేయనున్నట్లుగా చెబుతున్నారు. ట్రంప్ కుమార్తె అంత ఆ మాత్రం కేరింగ్ మామూలే మరి.