లాక్ డౌన్: మోడీకి షాకిచ్చిన కేసీఆర్

Update: 2020-04-19 06:28 GMT
భారతదేశంలో ఏప్రిల్ 20 నుంచి వివిధ రంగాలకు లాక్ డౌన్ ను మినహాయింపునిస్తూ వ్యాపార - వాణిజ్య - ఉద్యోగ సంస్థలు నడిచేలా ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు వేటిని నడిపించాలో కేంద్రం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.

అయితే కేంద్రం సూచించిన ఏప్రిల్ 20 తర్వాత తెలంగాణలో మాత్రం మినహాయింపులు లేవని..లాక్ డౌన్ మరింత కఠినంగానే అమలు చేయాలని సీఎం కేసీఆర్ తాజాగా అధికారులను ఆదేశించారు. ఈ చర్య తెలంగాణలోని ఆశావహులకు షాకింగ్ మారింది.

శనివారం తెలంగాణలో మరో 43 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 809కి చేరింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడమే మార్గమని.. ఏప్రిల్ 20 తర్వాత కూడా కేంద్రం సూచించిన మినహాయింపులు రాష్ట్రంలో కుదరవని.. స్టిక్ట్ గా లాక్ డౌన్ ను అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఈ ప్రకటన చేశారు.

ఆదివారం తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో మే3 వరకు లాక్ డౌన్ కొనసాగించడంపై సీఎం కేసీఆర్ అధికారిక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. లాక్ డౌన్ లో పేదలు - వలస కార్మికులు ఆకలితో అలమటించకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కేసీఆర్ కోరారు.

ఇక హైదరాబాద్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అక్కడ స్టిక్ట్ గా లాక్ డౌన్ అమలు చేయాలని.. ఒక్క పురుగును బయటకు రాకుండా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. రోజు వారీ కూలీలు - కార్మికులను గుర్తించి వారికి సహాయం చేయాలని అధికారులను కేసీఆర్ కోరారు.


Tags:    

Similar News