కేసీఆర్ కేర‌ళ ట్రిప్ వెనుక అస‌లు సీక్రెట్ ఇదేనా?

Update: 2019-05-08 04:57 GMT
ఎక్క‌డికి వెళ్ల‌టానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్‌.. కేర‌ళ‌కు ఎందుకు వెళ్లిన‌ట్లు?  సార్వ‌త్రిక ఎన్నిక‌ల మొద‌లు నుంచి ఐదో విడ‌త పోలింగ్ జ‌రిగే వ‌ర‌కూ పెద్ద‌గా ఫెడ‌ర‌ల్ వాదాన్ని వినిపించ‌ని ఆయ‌న‌కు హ‌టాత్తుగా కేర‌ళ ముఖ్య‌మంత్రి ఎందుకు గుర్తుకు వ‌చ్చారు?  క‌మ్యునిస్టుల‌తో పెద్ద‌గా పొస‌గ‌ని ఆయ‌న‌.. పిన‌ర‌యి చేత సంధి కోసం ట్రై చేస్తున్నారా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. అందుకు ఆయ‌న అవ‌స‌రం ఎందుకు?  తెలుగు రాష్ట్రాల్లో ఆ ప‌ని చేసేందుకు చాలామంది కామ్రేడ్స్ ఉన్నారుగా? అన్న సందేహం రాక మాన‌దు.

ఇంత‌కూ కేసీఆర్ కేర‌ళ ట్రిప్ వెనుక అస‌లు విష‌యం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌కు కొత్త స‌మాధానం వినిపిస్తోంది. కేర‌ళ‌కు వెళ్లింది ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం కాద‌ని.. త‌న సొంత ప‌ని మీద అన్న మాట వినిపిస్తోంది. గ‌డిచిన రెండు రోజులుగా తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో కేసీఆర్ టూర్ మీద వినిపిస్తున్న కొత్త వాద‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. కేసీఆర్ కేర‌ళ ట్రిప్.. గుట్టుచ‌ప్పుడు కాకుండా ఒక యాగం చేసేందుకేన‌ని చెబుతున్నారు. జాత‌క రీత్యా ఆయ‌న టైం ఇప్పుడు బాగోలేద‌ని.. ఇలాంటివేళ‌.. ఒక యాగం చేయాల‌న్న మాట‌ను కొంద‌రు న‌మ్మ‌క‌స్తులు చెప్ప‌టంతో.. అందుకు కేర‌ళ అనువుగా ఉంటుంద‌న్న ఉద్దేశంతోనే తాజాగా టూర్ పెట్టుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

విన్నంత‌నే అవున‌న్న భావ‌న క‌లిగేలా ఉన్న ఈ భావ‌న‌ను కొట్టిపారేస్తున్న వాళ్లు లేక‌పోలేదు. యాగం చేయాల‌నుకుంటే సారు.. ఫాంహౌస్ కు మించింది ఉండ‌ద‌ని.. యాగాన్ని చేసే రుత్వికులు కూడా అందుబాటులో ఉంటార‌ని.. యాగం కోసమే అయితే కేర‌ళ వ‌ర‌కూ వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్న మాట‌ను చెబుతున్నారు. కేసీఆర్ జాత‌కం ప్ర‌కారం మ‌రో మూడేళ్లు తిరుగులేద‌ని.. ఆ త‌ర్వాత ఆయ‌న స‌మ‌స్య‌లు ఎదుర్కొంటార‌న్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ రెండు వాద‌న‌లు త‌ప్ప‌ని.. కేవ‌లం ఫ్యామిలీతో గ‌డిపేందుకు కేర‌ళ‌కు వెళ్లి ఉంటార‌ని చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే.. భార్య‌తో పాటు.. మ‌న‌మ‌ళ్లు.. మ‌న‌మ‌రాళ్ల‌ను త‌న ద‌గ్గ‌ర ఉంచుకున్న కేసీఆర్.. త‌న‌తో పాటు కేర‌ళ‌కు వ‌చ్చిన మిగిలిన అనుచ‌రగ‌ణాన్ని వెన‌క్కి పంపించేయ‌టానికి కార‌ణం ఇదేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 
Tags:    

Similar News