కొత్త జిల్లాలకు సంబంధించిన ఈ ఉదంతం ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యానికి గురి చేస్తుందనటంలో సందేహం లేదు. దీనికి కారణం లేకపోలేదు. కొత్త జిల్లాలకు సంబంధించి చివరి క్షణాల్లో సైతం అధికారుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అలెర్ట్ చేస్తూ ఉండాల్సి వచ్చిందా? అంటే అవుననే చెబుతున్నారు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతాన్ని చూస్తే.. కొత్తజిల్లాలకు సంబంధించి ముఖ్య అధికారులు విపరీతమైన పని ఒత్తిడిలో పడిన విషయం ఇట్టే అర్థమవుతుంది. ఈ పరిస్థితిని ఊహించారేమోకానీ.. ముఖ్యమంత్రి అలెర్ట్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ముఖ్యమైన పనుల్ని పురమాయించినట్లుగా చెబుతన్నారు.
నిన్నటికి నిన్న మెదక్ జిల్లాలోని మర్కుక్ లో ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. అక్కడ ఆయన్ను మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రొనాల్డ్ ను చూసినంతనే ఆశ్చర్యానికి గురైన ముఖ్యమంత్రి.. ఏం రొనాల్డ్ ఇంకా మహబూబ్ నగర్ వెళ్లలేదా? అని ప్రశ్నించారు. ‘‘రేపొద్దున్నే జిల్లా ప్రారంభించాల్సి ఉంది కదా? ఇంకా మీరిక్కడే ఉన్నారు? రేపొద్దునకు మహబూబ్ నగర్ కు ఎప్పుడు వెళ్తావ్?’’ అని అడిగారు.
ఇంకా ఆర్డర్ రాలేదు సర్.. అంటూ రొనాల్డ్ సమాధానం ఇవ్వటంతో ఓకే అన్న ముఖ్యమంత్రి కాసేపు మిగిలిన విషయాలు మాట్లాడారు. ఆ తర్వాత సీఎస్ రాజీవ్ శర్మకు ఫోన్ చేసి.. వెంటనే జిల్లా కలెక్టర్లు..ఎస్పీలకు సంబంధించిన నియామకాల ఆర్డర్లు ఇవ్వాలని చెప్పిన తర్వాతే ఆర్డర్లు జారీ చేశారు. ఆ తర్వాతే జిల్లాల వారీగా కలెక్టర్లు.. ఎస్పీల నియామకాలకు సంబంధించిన స్పష్టత రావటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/