ఏదైతేనేం తెలంగాణ కేసీఆర్ ముందుకే వెళ్తున్నారు.. ముందస్తు ఓట్ల పండుగ తెచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ ను కలువనున్నారు. అయితే కేసీఆర్ దీనివెనుక ఎంతో ఆలోచించే ఈ నిర్ణయాలు తీసుకున్నారని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. అసెంబ్లీ రద్దుకు పలు కారణాలను వారు విశ్లేషిస్తున్నారు.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి ముందే దెబ్బకొట్టడం.. 2019 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగేందుకే ఈ ముందస్తు తెచ్చినట్టు చెబుతున్నారు.
*ముందస్తు వెనుక అసెంబ్లీ సీట్ల పెరుగుదల
కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికి ప్రధాన కారణం.. అతి ఎక్కువ స్థానాలు గెలచుకోవడానికే.. సార్వత్రిక ఎన్నికలతో కలిసి వెళ్తే ప్రజల దృష్టి జాతీయ కోణంలో ఉంటుంది. ఎంపీ సీట్లు టీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ, కాంగ్రెస్ లకే పడతాయి. అదే సమయంలో అసెంబ్లీ సీట్లు తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే ముందస్తుకు వెళితే ప్రజల దృష్టి మొత్తం రాష్ట్ర అసెంబ్లీ సీట్లపైనే ఉంటుంది. టీఆర్ఎస్ కు ఎక్కువ పడే అవకాశాలుంటాయి. ఇది ముగిశాక లోక్ సభ ఎన్నికలపై ఈజీగా దృష్టి సారించవచ్చు.
* థర్డ్ ఫ్రంట్ లేదా బీజేపీకి వెన్నుదన్ను కోసం..
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అందుకే ముందుగా అసెంబ్లీకి వెళ్లి ఇక్కడ పాగా వేశాక జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిసారించనున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తారు. 2019 లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం కేసీఆర్ కు కష్టమవుతుంది. అందుకే ముందస్తుకు వెళ్లి ఆ తర్వాత జాతీయ స్థాయిపై దృస్టి సారిస్తే కీలకంగా ఎదుగుతారు. అసెంబ్లీలో గెలిస్తే ఆటోమేటిక్ గా పార్లమెంట్ లో ప్రజలందరూ టీఆర్ఎస్ నే పూర్తి స్థాయిలో గెలిపిస్తారు. అప్పుడు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పగలరు. అదే ప్లాన్ తో కేసీఆర్ ముందస్తుకు సిద్ధమయ్యారు..
*కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటోంది. దాన్ని దెబ్బ కొట్టేందుకు.. సిద్ధం కాకముందే ఎన్నికలకు వెళ్లి లాభం పొందేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉండడంతో ఆయన జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ఫ్రంట్ తో కలిసే అవకాశం లేదు. దీంతో థర్డ్ ఫ్రంట్ లేదంటే బీజేపీనే కేసీఆర్ కు చాయస్.. ప్రధాని మోడీకి కూడా ఇదే చెప్పి ముందస్తుకు ఒప్పించినట్టు తెలిసింది. టీడీపీ అవిశ్వాసం, డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సమయంలో కేసీఆర్ బీజేపీకి మద్దతివ్వడంతో వచ్చే ఎన్నికల్లో గెలిచినా కేసీఆర్ అడుగులు బీజేపీ వైపే పడనున్నాయి. దీంతో కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే ధ్యేయంగా కేసీఆర్ ఈ ముందస్తుకు ప్లాన్ చేశారు.
*ప్రస్తుతానికి ఒంటరియే.. తర్వాత బీజేపీ
ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ఒంటరిగా వెళ్తారు. అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒంటరిగానే ఎంపీ సీట్లకు పోటీ చేస్తారు. కానీ ఫుల్ మెజార్టీ వస్తే మాత్రం బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. బీజేపీ గ్రాఫ్ పడిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం మోడీకి దక్షిణాదిన టీఆర్ ఎస్ - అన్నాడీఎంకేనే పెద్ద దిక్కు. అందుకే కేసీఆర్ ముందస్తుకు బీజేపీ ఇతోధికంగా సాయం చేస్తోంది. ఎన్నికల తర్వాత అవసరాన్ని బట్టి కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఇలా చాలా కారణాలు కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికి ఉన్నాయి. కానీ ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి.
1) లోక్ సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్రంలో చక్రం తిప్పేందుకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు.
2) పుంజుకుంటున్న కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు ఈప్లాన్ చేశారు
3) ముందస్తు ఎన్నికల్లో బీజేపీ ప్రభావం పడకుండా ఉండడానికి టీఆర్ఎస్ కే పూర్తి ఓట్లు పడడానికి ఈ ప్లాన్ చేశారు.