బడ్జెట్ స‌మావేశాలు ఖ‌రారు..కేబినెట్‌ లేకుండానే కేసీఆర్ షో

Update: 2019-02-08 17:27 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. తెలంగాణ‌లో రెండో ద‌ఫా అధికారం చేజిక్కించుకున్న త‌ర్వాత‌ ప్ర‌భుత్వ ఏర్పాటు సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసిఆర్ స‌హా మ‌రో మంత్రిగా మ‌హ్మూద్ అలీలు ప్ర‌మాణ స్వీకారం చేశారు. దాదాపు రెండు నెల‌లుగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ పెద్ద‌గా దృష్టి సారించ‌లేదు. శుభముహూర్తాలు లేక‌పోవ‌డం కార‌ణంగానే అని పేర్కొంటూ...ఈ నెల 6 వ తేదీ నుంచి  మంచి రోజులు రావ‌డంతో....మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారవుతుంద‌న్న ధీమా అధికార పార్టీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. అయితే, దీంతో సంబంధం లేకుండానే...బ‌డ్జెట్ తేదీలు ఖ‌రారు అయ్యాయి.

విశ్వ‌సనీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం - తెలంగాణా బడ్జెట్ సమావేశాల తేదీలు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. 2019 ఫిబ్రవరి 25 నుంచి 4 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆర్ధిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు ఆదివారం కనుక కేబినెట్ విస్తరణ జరిగితే ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ను శాసనసభలో  ప్రవేశ  పెడతారు. లేని పక్షంలో సీఎం కేసీఆరే స్వయంగా బడ్జెట్ ను ప్రవేశ పెడతారు.

కాగా, గ‌తంలో ప‌లు అసెంబ్లీలు జ‌రిగిన తీరును ఈ సంద‌ర్భంగా కేసీఆర్ త‌న సన్నిహితుల‌తో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో గతంలో జలగం వెంగళరావు సీఎం హోదాలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇదే రీతిల‌తో సీఎం హోదాలో కేసీఆర్ బడ్డెట్ ప్రవేశపెట్టే అవ‌కాశాలు లేక‌పోద‌ని అంటున్నారు. ఈ ఉత్కంఠ‌కు తెర‌ప‌డాలంటే..మ‌రో రెండ్రోజులు ఆగాల్సిందే.
Tags:    

Similar News