తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహాన రెడ్డి సమావేశం ఆంధ్ర్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం అయిన విషయం తెలిసిందే. తెలంగాణలో తెలుగుదేశం దారుణ ఓటమితో చంద్రబాబు ఏపీ ఎన్నికలకు అలెర్ట్ అయ్యారు. జగన్ ఎవరితో కలవకుండా చేసే మాస్టర్ ప్లాన్ వేయడానికి సిద్ధమయ్యారు. దీనిని ముందుగా గ్రహించిన టీఆర్ ఎస్... ఎలాగైనా చంద్రబాబును ఎదుర్కోవడానికి సిద్ధమైంది. అందుకే వైసీపీ ప్లానింగ్ లో తనకు చేతనైనంత ఎలక్షన్ ప్లానింగ్ చేస్తోంది. ఇది రిటర్న్ గిఫ్ట్ లో మొదటి దశ కానుంది.
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామయంగా జాతీయాస్దాయిలో మూడో ప్రత్యామ్నయాన్ని ఏర్పాటు చేసేందుకు కె. చంద్రశేఖర రావు ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలో బలమైన లీడర్లు అయిన మమత - స్టాలిన్ - పట్నాయక్ - జగన్ లను అందుకే కలుపుకుని పోతోంది.
మరో నాలుగు నెలలలో ఆంధ్రప్రదేశ్ లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు లోక్ సభకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు ఎన్నికలలోను వైఎస్ ఆర్ సీపీ - తెలంగాణ రాష్ట్ర సమితి కలసి పనిచేస్తాయని వార్తలు వస్తున్నాయి. కెటిఆర్ - జగన్ ల సమావేశం ఈ విషయాన్ని ధృవీకరించినట్టయ్యింది. ఇప్పటికే కుల సంఘాలను - మహిళలను విద్యార్దులను తెలుగుదేశం పార్టీకి ఏపీలో వ్యతిరేకంగా పనిచేసేలా తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహ రచన చేస్తోంది. ఈ వ్యూహాన్ని పగడ్భందీగా అమలు చేయడం కోసం కెటిఆర్ - జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు.
తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టే వ్యూహాల్లో జగన్ చేసిన సాయం నేపథ్యంలో... తమకు సహకరించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తామూ సహకరిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అవసరమైనే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ప్రచార సభలలో పాల్గొంటానని కూడా కెటిఆర్ భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింతా రంజుగా మారాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Full View