ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టిసీమ విషయంలో ఎన్ని అపవాదులు.. ఎన్ని ఎత్తిపొడుపులు.. ఎన్ని ఆరోపణలు... ఎన్ని విమర్శలు ఎదురయ్యాయో తెలిసిందే. అయితే... ఊహించని వ్యక్తి నుంచి చంద్రబాబుకు పట్టిసీమపై ప్రశంసలు అందాయి. ప్రస్తుతం చంద్రబాబు కంటే వైజ్ సీఎం అన్న పేరు తెచ్చుకుంటున్న కేసీఆర్ నుంచి ఈ ప్రశంసలు రావడం విశేషం. అంతేకాదు... ఏదో ముఖస్తుతి కోసం చంద్రబాబు ఎదుట చెప్పిన మాటలు కాకుండా తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు పరోక్షంలో కేసీఆర్ ఇలా ప్రశంసించడం నిజంగా గొప్ప విషయమే. పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చాలా ధైర్యం చేశారని... ఆయన ధైర్యంగా ముందుకెళ్లడం గొప్ప విషయమేనని.. ఈ విషయంలో ఆయన్ను అభినందిస్తున్నానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో జలవిధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కేసీఆర్ ఈ మాట చెప్పారు. ఏపీ రైతులు కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించి మరోసారి ఆంధ్రవాళ్ల మనసు దోచుకున్నారు.
అదే సమయంలో పోలవరం విషయంలో తాను చంద్రబాబుకు పలు సూచనలు చేశానని కూడా చెప్పారు. పోలవరం నుంచి రెండు దిశలకు నీళ్లు వెళ్లేలా ప్రాజెక్టు కట్టాలని చంద్రబాబుకు చెప్పానన్నారు. ఒక వైపు నుంచి విశాఖపట్టణం వెళ్లే దిశగా నీళ్లు మళ్లించుకోవాలని, అలాగే రెండో వైపు నుంచి రాయలసీమ వైపు నీళ్లు తరలించాలని చెప్పానని అన్నారు. కేవలం ఇవే కాకుండా మధ్య మధ్యలో చిన్న ప్రాజెక్టులు కొన్ని కట్టుకోవాలని కూడా సూచించానని ఆయన చెప్పారు. చంద్రబాబుతో ఊరికే గిల్లికజ్జాలు పెట్టుకోవడం కూడా తనకు ఇష్టం లేదని... త్వరలోనే చంద్రబాబును కలిసి పలు ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకుంటానని కేసీఆర్ చెప్పారు. రైతులు ఎక్కడి వారైనా రైతులేనని, తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.