తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కొత్త భవనం అయిన ప్రగతిభవన్ మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించిన కేసీఆర్ అనంతరం మీడియాతో సమావేశమయ్యారు. ఇవాళ జరిగిన మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్న పలు అంశాలను సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. రైతు రుణమాఫీ - మైనార్టీలు - గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల అంశం - శాసనసభ ప్రత్యేక సమావేశం - న్యూ హెరిటేజ్ పాలసీ వంటి తదితర అంశాలకు సంబంధించిన విషయాలను సీఎం వివరించారు. బీసీల కోటాలో వెనుకబడిన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తాము ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదిస్తామని...కేంద్రంతో మాట్లాడి దీనికి రాష్ట్రపతి ఆమోదం ఇప్పించాలని కోరుతామని కేసీఆర్ చెప్పారు.
కేంద్రం కూడా అనుమతి ఇప్పిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసిన కేసీఆర్ దాన్ని వ్యతిరేకిస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని స్పష్టం చేశారు. తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్ 32 ఏళ్లుగా కొనసాగుతోందని తెలిపారు. అలాగే తెలంగాణకు సైతం అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. దేశంలో ఒక రాష్ట్రానికి ఒక నీతి, మరో రాష్ట్రానికి మరో నీతి ఉండటానికి వీల్లేదని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకుంటుందని తాను భావించడం లేదని కేసీఆర్ చెప్పారు. `ఒక పార్టీకి ఒక పిచ్చి ఉంటుంది.వాళ్లకు ఏం ఉందో నాకు తెలియదు కానీ...మాకు ప్రజల పిచ్చి ఉంది. ప్రజల మేలు కోసం మేం పనిచేస్తాం. అవసరమైతే ఇందుకోసం పోరాటం చేస్తాం` అని ప్రకటించారు.
ఇదిలాఉండగా...గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా పని చేసిన బి.రాజేశ్వర్ రావు - ఫారుఖ్ హుస్సేన్ లను మరోసారి నియమించాలని గవర్నర్ నరసింహన్‌ను కోరనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మంత్రి మండలి కూడా తీర్మానాన్ని ఆమోదించిందని పేర్కొన్నారు. ఆ తీర్మానాన్ని త్వరలోనే గవర్నర్ కు పంపించనున్నట్లు ఆయన అన్నారు. టీఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు 75 లక్షలు దాటడం హర్షదాయకమని కేసీఆర్ అన్నారు. ఎప్పటిలాగే పార్టీ అధ్యక్ష ఎన్నికను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేపడతారని తెలిపారు. 14 నుంచి 20 వరకు గులాబీ కూలీ దినాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏ ఊరిలో వారు వాళ్ల ఊరిలోనే కూలీ చేయాలన్నారు. నేను కూడా కూలీ పని చేస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/