మరోసారి ఇద్దరు చంద్రుళ్లు కలిశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయగంలో పాల్గొనటానికి ఎర్రవెల్లి వచ్చిన ఏపీ సీఎంకు ఘన స్వాగతం లభించింది. చంద్రబాబు రాక గురించి ముందే తెలుసుకున్న చంద్రబాబు ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలకి.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా తనను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్న చంద్రబాబుకు.. అదే తరహాలో అంతే జాగ్రత్తగా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించింది. ఇప్పటివరకూ యాగానికి పెద్ద ఎత్తున వీఐపీలు వచ్చినప్పటికీ.. తానే ఎదురెళ్లి స్వాగతం పలకటం.. మాట్లాడటం లాంటి తక్కువే చేశారని చెప్పాలి.
మిగిలిన వారితో పోలిస్తే.. చంద్రబాబుతో కాస్తంత ఎక్కువసేపు మాట్లాడినట్లుగా కనిపించింది. ఫ్యాంటు.. షర్ట్ మీద వచ్చిన చంద్రబాబు.. పసుపు ఉత్తరీయాణ్ని నిండుగా కప్పుకున్నారు. ఆయన్ను చండీమాత విగ్రహం వద్దకు తీసుకొచ్చి దర్శనం చేయించిన కేసీఆర్.. యాగస్థలి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ తరఫున తీసుకొచ్చిన వస్తువుల్ని.. ఒక్కొక్కటిగా అందిస్తూ అగ్నిగుండంలో వేశారు.
యాగం జరిగిన తీరును.. జరుగుతున్న తీరును చంద్రబాబుకు కేసీఆర్ వివరించి చెప్పారు. అనంతరం ఆయనకు సన్మానం చేశారు. తన ఇంటికి వచ్చిన చంద్రబాబును అప్యాయంగా తీసుకెళ్లటంతో పాటు.. మర్యాద విషయంలో ఎలాంటి లోపం జరగకుండా చూసుకునేలా కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించింది.