తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరోమారు తన మాట నెగ్గించుకున్నట్లే కనిపిస్తోంది. ఎంతో ఇష్టపడి మొదలుపెట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియలో వచ్చిన అభ్యంతరాలు - ప్రతిపాదనలు పక్కనపెట్టినట్లు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే ఆయన ముందుకు పోతున్నట్లు చెప్తున్నారు. జిల్లాల ముసాయిదాలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపించటం లేదు. తాజాగా కొత్త జిల్లాలకు నిధుల కేటాయించడం ద్వారా పరోక్షంగా ప్రభుత్వమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రజా స్పందన - అధికారుల కసరత్తు తరువాత చేర్పులు - మార్పులు ఉంటాయని ప్రకటించినప్పటికీ, కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలకు జరిగిన నిధుల కేటాయింపులతో ముసాయిదాలో మార్పులు ఉండవన్న విషయం అవగతమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దసరా నుంచి మనుగడలోకి రానున్న కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడానికి జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.26 కోట్లను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. నిధుల కేటాయింపు నుంచి హైదరాబాద్ జిల్లాను మినహాయించినట్టు పేర్కొంది. హైదరాబాద్ మినహా ఇతర 9 జిల్లాల్లోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుండటంతో వాటికి మాత్రమే నిధులు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. జిల్లాల పునర్విభజన నుంచి మినహాయించిన హైదరాబాద్ తప్ప మిగతా 9 పాత జిల్లాలు - 17 కొత్త జిల్లాలకు మాత్రమే ప్రణాళిక శాఖ నిధులు విడుదల చేయడం కీలకమైన అంశంగా చెప్తున్నారు. ఈ నిర్ణయంతో మహబూబ్ నగర్ జిల్లా గద్వాల - వరంగల్ జిల్లా జనగామ రెంటినీ జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లను సర్కారు పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విషయం తేలిపోయిందని చెప్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న 17 జిల్లాలతో పాటు ప్రస్తుత 9 జిల్లాలు (హైదరాబాద్ మినహా) కలిపి 26 జిల్లాలకు జిల్లాకు రూ. కోటి చొప్పున కేటాయిస్తున్నట్టు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య పేర్కొన్నారు. నిధులను కొత్త జిల్లాల్లో రవాణా - ఫర్నీచర్ - ఫైళ్లు - కంప్యూటర్లు - కమ్యూనికేషన్ వ్యవస్థ సమకూర్చుకోవడానికి వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజిస్తుండటంతో, ఆ జిల్లాకు అధికంగా రూ.4 కోట్లు కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజామాబాద్ - ఖమ్మం జిల్లాలను రెండేసి జిల్లాలుగా విభజిస్తుండటంతో వాటికి రూ.2 కోట్ల చొప్పున కేటాయించినట్టు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - నల్లగొండ - మెదక్ - కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాలను మూడేసి జిల్లాలుగా విభజిస్తుండటంతో వాటికి రూ.3 కోట్లు చొప్పున కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. బడ్జెట్‌లో అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి రూ.5173 కోట్ల నుంచి ప్రస్తుత నిధులను కేటాయించినట్టు ప్రణాళిక శాఖ పేర్కొంది. మొత్తంగా సీఎం కేసీఆర్ జిల్లాల విభజన విషయంలో తన మాట నెగ్గించుకున్నట్లయిందని అంటున్నారు.