కోటి కలల తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ నినాదాన్ని ఎలుగెత్తి చాటటమే కాదు.. దిక్కులు పిక్కట్టిల్లేలా నినదించేలా తెలంగాణ సమాజాన్ని సమాయుత్తం చేసిన ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్రం రావటమే ఆలస్యం సమస్యలన్నీ జిందా తిలిస్మాత్ మాదిరి ఒక్కసారే పోతాయని మాటలు చెప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతోంది.
పొద్దున్నే పేపర్ తీస్తే తెలంగాణ సమాజంలో అన్నదాత రోజుకు పది మందికి తగ్గకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. గడిచిన 16 నెలల్లో 1400 మంది రైతుల తమ ఉసురు తీసుకున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గళం విప్పారు. రైతుల ఆత్మహత్యల గురించి తన వాదనను వినిపించారు. తమ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పారు.
తెలంగాణ రైతుల గురించి పాట రాసిన తన పాలన గురించి సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చేసుకున్న ఆయన మాటల్ని యథాతధంగా చెప్పేస్తే..
= దేశంలో ఎక్కడా లేనన్ని విత్తనాల కంపెనీలు మన దగ్గర ఉన్నాయి. అయినా పరిష్కారం కావటం లేదు. రైతుల కోసం ఏం చేయాలో అధికారులతో మాట్లాడా.
= ప్రతిపక్షాలు విమర్శలు చేయటం సహజం. వాటిని సానుకూలంగా తీసుకుంటున్నాం.
= తాత్కలికంగా చెప్పే వాటికి ఓకే.. దీర్ఘకాలిక చర్యలపై వివరంగా ప్రతిపాదనలు రావాలి. దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి.
= అనేక ఏళ్లుగా ప్రాజెక్టులు సాగుతున్నాయి. అప్పుడెప్పుడో 1960లో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు.
= సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో భయంకరమైన దగా జరిగింది. ప్రతిపక్షాలు ప్రభుత్వం కలిసి వస్తే బాగుంటుంది.
= 2018 నాటికి మేం పూర్తి స్థాయి విద్యుత్ ఇస్తాం. ఉదయాన్నే రైతులు మోటార్లు వేసుకునేలా కరెంటు ఇస్తాం.
= రైతులకు మనవి చేస్తున్నా.. ఆత్మహత్యలు చేసుకోవద్దు. మేం కార్యాచరణ మొదలు పెట్టాం.
= ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలు ఆత్మహత్యలు చేసుకున్న వారి కోసం తీసుకున్న చర్యల గురించి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నాం.
= హైకోర్టు చెప్పినట్లే పరిహారంతో ఉపశమనం సరికాదనటం సరైందే. పరిహారాలు ఉపశమనం తాత్కలికమే.. శాశ్విత పరిష్కారం కోసం ఆలోచించాలి.
= రైతుల ఆత్మహత్యలు చేసుకుంటన్నారన్న మూలాల్లోకి వెళ్లాలని హైకోర్టు చెప్పటం సంతోషంగా ఉంది. కోర్టుకి ధన్యవాదాలు చెబుతున్నా.
= పెరుగన్నం తినే రైతన్న పురుగుమందు తాగుతున్నడని రైతుల కోసం నేనే పాట రాశా. ఓవర్ నైట్ రైతుల సమస్య పోదు.
= వేల ఏళ్ల అనుభవం ఉన్న వారు ఈ సభలో ఉన్నారు. వారు సలహాలు ఇవ్వాలి.
= ప్రాజెక్టులు కట్టకపోవటం.. విచక్షణా రహితంగా అడువులు నరకటం.. వర్షం పడకపోవటం.. బోర్లు పడకపోవటం కారణం కాదా? అందుకేగా భూగర్భ జలాలు పడిపోయాయి.
= నల్గొండ జిల్లాలో ఓ రైతు 54 బోర్లు వేసి.. బోర్ల రెడ్డిగా ఆయన పేరు మారిపోయింది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉన్న తెలంగాణను సర్వనాశనం చేసేశారు.
= వ్యవసాయ యూనివర్సిటీలో 5వేల ఖాళీలున్నాయి. దీనికి ఎవరు బాధ్యత? ఇదో వ్యక్తి.. పార్టీనో కారణం కాదు. అందుకే మనమంతా పరిష్కారం చూడాలి.