కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్... బాబుకు జైలేనా?

Update: 2018-12-14 06:19 GMT
"మనింటికి పుట్టినరోజు పండక్కి ఎవరైన వస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా లేదా... అలాగే నేను చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా" ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ప్రజాకూటమి తరఫున ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడిపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. తనది కాని రాష్ట్రంలో తనకేంపని అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం చేసారు కాబట్టి తాను కూడా ఆంధ్రప్రదేశ్ వెడతానన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడకు వచ్చి నాకు ఒక బహుమతి ఇచ్చారని దానికి ప్రతిఫలంగా తాను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు.

దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్షనేత వైఎస్‌. జగన్ మోహన రెడ్డి తరఫున కేసీఆర్ ప్రచారం చేస్తారని ఊహాగానాలు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం రిటర్న్ గిఫ్ట్ అంతే చంద్రబాబు నాయుడిని జైలుకి పంపడమేనని అంటున్నారు. ఓటుకు నోటు కేసులో ప్రధాన సూత్రధారిగా చంద్రబాబు నాయుడిని - రేవంత్ రెడ్డిని కేసీఆర్ పరిగణించారు. ఈ కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్లారు. తాను జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని ప్రకటిస్తున్న కేసీఆర్ చంద్రబాబు నాయుడిపై ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ తన దూకుడు పెంచారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వహాణ అధ్యక్షుడిగా తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు బాధ్యతలు అప్పగించారు. అంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు ద్రుష్టి సారిస్తారని అంటున్నారు.  అదే జరిగితే జాతీయా స్దాయిలో ఫెడరల్ ఫ్రంట్‌ ని ఏర్పాటు చేసి చక్రం తిప్పడం ‍ఖయామంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి అవుతాడని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జాతాయ స్దాయిలో తన ప్రభవం ఉన్న ప్రభుత్వం తెలంగాణలో తన ప్రభుత్వం - ఆంధ్రప్రదేశ్‌ లో తన మిత్రుడి ప్రభుత్వం వస్తాయన్నది కెసీఆర్ అంచన. ఇదే జరిగితే ఓటుకు నోటు కేసును తిరగదోయడం దాని ద్వారా చంద్రబాబు నాయుడిని జైలుకు పంపడం ఖాయమని అంటున్నారు. చంద్రబాబు నాయుడికి  తాను ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ పదవి నుంచి తప్పించడమూ - జైలుకి పంపించడమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News