కదిలించేసేలా మాట్లాడటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. జరిగిన ఆలస్యాన్ని కవర్ చేసుకునేలా మాట్లాడటమే కాదు.. ఎవరూ ప్రశ్నించని రీతిలో ఆయన వ్యవహరిస్తారు. ఇలాంటి టాలెంట్ సమకాలీన రాజకీయాల్లో ఏ తెలుగు అధినేతలోనూ కనిపించవు. తానెంతో కదిలిపోయానని చెప్పుకునే ఆయన.. మరింత కాలం ఏం చేసినట్లు? అన్న ప్రశ్న నోటి నుంచి రాకుండా చేస్తారు. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం చూస్తే.. ఇదెంత నిజమన్నది ఇట్టే తెలిసిపోతుంది.
ఉన్నట్లుండి..ఏదో గుర్తుకు వచ్చినట్లుగా కొన్ని అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసే తీరు కేసీఆర్ లో కనిపిస్తుంది. రెండు.. మూడు నెలలకు తక్కువగా మూడేళ్లుగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. తన పాలనను ఒక క్రమపద్ధతిలో ఉంచినట్లుగా కనిపించరు. ఒక ఆర్డర్ ప్రకారం ఆయన ఇష్యూల మీద ఫోకస్ చేసినట్లుగా కనిపించరు.
తాజాగా చేనేత కార్మికుల వెతల మీద ఫోకస్ చేసిన ఆయన.. ప్రగతి భవన్ లో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల నుంచి వచ్చిన పవర్ లూమ్ పరిశ్రమకు చెందిన 40 మంది ప్రతినిదులు.. పలువురు సీనియర్ అధికారులు.. మంత్రులు కేటీఆర్.. తుమ్మలతో కలిసి సమీక్ష నిర్వహించిన సందర్భంగా కేసీఆర్ చెప్పిన కొన్ని మాటల్ని ఇక్కడ ప్రస్తావించాల్సిందే. దీనికి ముందు కొన్ని విషయాల్ని గుర్తు చేసుకోవటం సబబుగా ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా చేనేత కార్మికుల మీదా.. చేనేత వస్త్రాల మీద మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటం తెలిసిందే.
చేనేతకు సమంతను బ్రాండ్ అంబాసిడర్ ను చేయటం.. చేనేత వస్త్రాల్ని విధిగా ధరించాలన్న మాటను చెప్పటం.. ఈ మధ్యనే తమిళనాడులోని తిరువూరుకు వెళ్లి.. అక్కడి పరిస్థితుల మీద అధ్యయనం చేయటం లాంటివి చేశారు. కొడుకు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ కావొచ్చు.. చేనేత కార్మికుల్ని గంపగుత్తగా టీఆర్ ఎస్ సర్కారు వైపు మొగ్గు చూపించాలన్న ఆశో.. లేక చేనేత సమస్యల మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేనేత గర్జన పేరిట గుంటూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న వైనానికి ముందే తామీ అంశాల మీద ఫోకస్ చేసినట్లుగా వ్యవహరించాలని అనుకున్నారో కానీ.. చేనేత సమస్యల మీద కేసీఆర్ భారీ ఫోకస్ నే చేశారు. సమీక్ష సందర్భంగా కేసీఆర్ చెప్పిన కొన్ని మాటల్ని చూస్తే..
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో చేనేత కార్మికుల దీనావస్థను చూసి రెండుసార్లు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఓరోజు పేపర్లో సిరిసిల్లలో ఒకేరోజు 11 మంది చేనేత కార్మికుల మృతి అన్న వార్త వచ్చింది. అది చూడగానే మనసు చలించింది. ఏడ్చినంత పనైంది. తిండి లేక కార్మికులు మరణించటం బాధ అనిపించింది. సిరిపిల్ల కార్మికులకు ఎంతో గొప్ప పేరుంది. వారిలా చావడటం ఏమిటని ఆలోచించాను. పరభుత్వం నుంచి సాయం అందే పరిస్థితి లేదు.అప్పుడునేనే పూనుకొని టీఆర్ ఎస్ తరఫున రూ.50లక్షల పంపా. అక్కడున్న సొసైటీ ఆ డబ్బులను అవసరం ఉన్న వారికిచ్చి ఆదుకుంది. మరో సందర్భంలో పోచంపల్లిలో ఏడుగురు కార్మికులు మరణించారన్న వార్త చూశా. ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్మికుల బాధలు చూసి ఏడ్చా. నేనే స్వయంగా భిక్షాటన చేసి రూ.4లక్షలు జమ చేసి వారికి అందజేశా. ఈ బాధ తెలంగాణలో కొనసాగొద్దన్నదే నా ఆకాంక్ష. అందుకోసమే ఈ ప్రయత్నం’’ అని వ్యాఖ్యానించారు.
కదలిపోయేలా మాటలు చెప్పే కేసీఆర్ మాటలు విన్నంతనే.. ట్రాన్స్ లోకి వెళ్లిపోయి.. చేనేత కార్మికుల వెతల మీద ముఖ్యమంత్రికి ఎంత సానుకూలత ఉంది? వారి ఇబ్బందుల విషయం మీద ఆయన ఎంతగా వేదన చెందుతున్నారన్న భావన కలగటం ఖాయం. మరి.. చేనేత కార్మికుల సమస్యలపై కేసీఆర్ కు అంత కమిట్ మెంట్ ఉండి ఉంటే.. గడిచిన మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎందుకు పట్టించుకోనట్లు? నిజంగా వారి సమస్యలకు పరిష్కారం చూపించాలన్న ఆలోచనే ఉండి ఉంటే.. ప్రభుత్వం కొలువు తీరిన ఏడాది తర్వాత కళ్లు తెరిచినా.. ఇష్యూ ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చేదిగా..? జరిగిన ఆలస్యం గురించి ప్రస్తావించకుండా.. సమస్యను పరిష్కరించకుండానే.. చేనేత అంశాల మీద తమకున్న కమిట్ మెంట్ మరెవరికీ లేదన్న భావన కలిగించటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. తనను ఏడిపించిన అంశంపై ఆయన దృష్టి పెట్టటానికి ఇంత కాలం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పే వారెవరు?అన్నదే పెద్ద ప్రవ్న.
ఒక్క సమీక్ష.. చేనేత ప్రతినిధులతోకలిసి భోజనం చేయటం లాంటి పనులతో.. చేనేతల ఆత్మబంధువుగా కేసీఆర్ మారిపోయారన్న భావనకలిగించటంలో ఆయన విజయం సాధించారనే చెప్పాలి. సమస్యలకు పరిష్కారం మాటలతో చెప్పేసే వైనం అద్భుతంగా సాగినంత కాలం.. సమస్యలు అలానే కొనసాగుతాయనటంలో సందేహం లేదు. కావాలంటే.. కదిలే కాలంతో పాటు.. చేనేత కార్మికుల కష్టాల్ని గమనిస్తూ ఉండండి. ఎంత కాలానికి వారి సమస్యలు తీరుతాయో అర్థమవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/