పుట్టిన ఊరు మీద.. కన్న కులం మీద ఆ మాత్రం ప్రేమ ఎవరికైనా ఉంటుంది. అందరూ ఎప్పుడో ఒకప్పుడు తమ వారికోసం ఏదైనా చేస్తుంటారు. కానీ పెద్ద సార్ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రేమ మాత్రం అపూర్వం.. అనూహ్యం.. దాని విలువ వందల కోట్ల పైమాటే.. అంతే మరీ.. కేసీఆర్ లాంటి బలమైన నేత కరుణిస్తే అంతే రిచ్ గా ఉంటుంది.
హైదరాబాద్ లోనే అత్యంత ఖరీదైన హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత ఖరీదైన భూమి అది. హైటెక్ సిటీ ఎదురుగా ఉండే అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్లకు పైగానే విలువ ఉన్న ఐదు ఎకరాల అత్యంత ఖరీదైన భూమి ని కేసీఆర్ తన కులం వారికి కేటాయించేశారు. ఐదు ఎకరాలను రెండు కుల సంఘాలకు కేటాయించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటాయింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోందట.. ఈ మేరకు జీవో కాపీ మీడియాలో హైలెట్ అవుతోంది.
విశేషం ఏంటంటే.. భూమి కావాలని కేసీఆర్ సొంత సామాజికవర్గం ‘వెలమ’లతోపాటు రాష్ట్రంలోనే బలమైన కమ్మ సామాజికవర్గం వారు ప్రభుత్వాన్ని అడగడం.. రోజుల వ్యవధిలోనే సిఫార్సు చేయడం.. సీసీఎల్ఏ ఆమోదించడం.. ఆ తర్వాత ఉత్తర్వులు ఇవ్వడం జరిగిపోయాయి. ఇంత అర్జంటుగా అంత విలువైన భూమిని ఈ బడా కులసంఘాలకు ఎందుకు కేటాయించినట్టు.. బీడు భూములు, హైదరాబాద్ శివారుల్లో తక్కువ భూమి ఉండగా.. ఈ అత్యంత ఖరీదైన 100 కోట్లకు పైగా ఉన్న విలువైన భూమిని ఎందుకు కేటాయించినట్టు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని కులాలకు భవనాలు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని శంకుస్తాపనలు కట్టారు. కానీ ఇంతవరకు ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు. కేటాయించిన స్థలాలు కోర్టు వివాదాల్లో ఉన్నాయట.. అన్నీ బీసీలకు, ఎస్సీలు, ఎస్టీలకు కేటాయించిన స్థలాలు ఉన్నాయి. ఓసీల కోసం పెద్దగా భవనాలు, భూములు కేటాయించలేదు.
తొలిసారిగా అగ్ర కులాలైన కమ్మ, వెలమ సంఘాలకు ఈ అత్యంత ఖరీదైన భూమిని కేటాయించడం చర్చనీయాంశమైంది. అదీ కూడా అత్యంత విలువైన ప్రాంతంలో.. కమ్యూనిటీకార్యక్రమాలకు సరిపడని పారిశ్రామిక ప్రాంతంలో ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయ్యప్ప సొసైటీ భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. అది జూబ్లీ హిల్స్ లో కలిసిపోయింది. అలాంటి చోట ఇప్పుడు కులసంఘాలకు భూములు కేటాయిస్తే ఖచ్చితంగా వివాదాస్పదమై ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. మరి ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి.