తెలంగాణ సాగు సంస్కరణ.. కేసీఆర్ సంచలనం

Update: 2020-04-26 10:18 GMT
తెలంగాణలో ఈ సీజన్ లో ఎన్నడూ లేనంత పంట పండింది. దానికి కారణం ఈసారి వర్షాలు బాగా పడడంతోపాటు కాళేశ్వరం జలాలు - కృష్ణా నది ఉప్పొంగడంతో రైతులకు పుష్కలంగా నీరు ఇచ్చింది సర్కారు. దీంతో దేశంలోనే అత్యధిక పంట పండిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కరోనా లేకుంటే ‘రైతు పండుగ’ను కూడా  ఘనంగా నిర్వహించేవాడినని కేసీఆర్ అన్నాడు.ఈ సందర్భంగానే తెలంగాణలో సాగు సంస్కరణను చేశారు కేసీఆర్.
 
తెలంగాణ పంట సీజన్లలో ఖరీఫ్, రబీ పేర్లను మారుస్తూ  తెలంగాణ సిఎం కేసీఆర్ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు పేర్లను ఖరీఫ్ మరియు రబీలుగా కాకుండా వానాకాలం మరియు యాసంగిగా మార్చాలని ఆదేశించారు, ఇన్నాళ్లు ఖరీఫ్ - రబీ అంటే ఎవరికీ అర్థం అయ్యేది కాదని.. అందుకే ఈ తెలంగాణ పదాలు అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి.

ఇప్పటి నుంచి తెలంగాణలో వానాకాలం పంట - యాసంగి పంట మాత్రమే ఉంటుందని కేసీఆర్ తెలిపారు.  డిపార్ట్‌మెంటల్ ఆర్డర్లు - కార్పొరేషన్లు - వ్యవసాయ సంస్థలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాలు మరియు సిలబస్‌ లలో ఈ మేరకు ఈ పదాలను మార్చి ఉపయోగించాలని ఆదేశించినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పంట సీజన్లను సాధారణంగా ఖరీఫ్ మరియు రబీ పేర్లతో పేర్కొంటారు. ఖరీఫ్ పంటలను  వర్షాకాలంలో జూన్ నుండి అక్టోబర్ వరకు పండిస్తారు. వీటిని రుతుపవనాలతో వేసే పంటలుగా పిలుస్తారు.  రుతుపవనాల ప్రారంభంలో విత్తనాలను విత్తుతారు. ఇక వర్షాకాలం ముగింపు చివరి దశలో  అక్టోబర్-నవంబర్ నుంచి యాసంగి పంటలు పండిస్తారు. ఖరీఫ్‌ లో వరి - మొక్కజొన్న పత్తి - చెరకు - పప్పుధాన్యాలు - వేరుశనగ పంటలు ఉన్నాయి.

  రబీ పంటలను అక్టోబర్ నుండి నవంబర్ వరకు శీతాకాలంలో పండిస్తారు.   ఎండా కాలం మొదలుకావడంతో ఈ పంటలు ముగుస్తాయి. రబీలో  వేరుశనగ - గోధుమ - పప్పుధాన్యాలు - బార్లీ - ఆవాలు పొద్దుతిరుగుడు - కొత్తిమీర - జీలకర్ర మరియు బంగాళాదుంప ఉన్నాయి.


Tags:    

Similar News