లంచం ఇస్తే చెప్పుతో కొట్టాలంటున్న కేసీఆర్‌

Update: 2017-10-08 14:16 GMT
సింగ‌రేణి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్ గెలుపుతో గుల‌బీ ద‌ళ‌ప‌తి - తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ జోష్‌ లో ఉన్నట్లుగా క‌నిపిస్తోంది. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌ లో సింగరేణి కార్మికులతో  ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ త‌న‌దైన మాట్లాడుతూ సింగరేణి గురించి ప్రజాప్రతినిధులతో గంటర్నరకుపైగా మాట్లాడినట్లు చెప్పారు. గతంలో కూడా టీబీజీకేఎస్‌ ను గెలిపించారని అయితే ఈ ద‌ఫా సింగరేణి కార్మికుల గెలుపు కావాలన్నారు. సింగరేణి కార్మికులకు మంచి జరగాలని సీఎం ఆకాంక్షించారు. కార్మికులు గెలిచినపుడే నిజమైన గెలుపని సీఎం కేసీఆర్ అన్నారు.

కార్మికుల సంక్షేమం కోసం ప‌లు నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు వివ‌రించారు. గ‌తంలో వ‌లే సంఘం గుర్తింపు కోసం రూ.20 కాకుండా...టీబీజీకేఎస్ గుర్తింపు సంఘానికి సభ్యత్వ రుసుము ఇక నుంచి ఒక్కరూపాయే ఇవ్వాలని సీఎం సూచించారు. సింగ‌రేణిలో లంచం సంస్కృతిని పోగొట్టాల‌ని సూచించారు. ``క్వార్టర్ మారినా లంచం ఇవ్వాలి. జ్వరం వచ్చినా లంచం ఇవ్వాలి. కార్మికులు ఎందుకు లంచం ఇయ్యాలే..?``అని సీఎం క‌సీఆర్‌ ప్రశ్నిస్తూ ``రేపటి నుంచి లంచం అడిగినోన్ని..లంచం తీసుకున్నోన్ని చెప్పుతో కొట్టండి`` అని సీఎం నిర్దేశించారు. సింగరేణి కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నార‌ని, అందుకే వారి మేలుకోసం ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌న్నారు. సింగరేణి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వాటా నుంచి రూ.50 కోట్లు తగ్గించుకోనైనా, రూ.10 లక్షల రుణం ఇస్తామని సీఎం పునరుద్ఘాటించారు. కార్మికుల తల్లిదండ్రులకు కూడా రిఫరల్ హాస్పిటల్ కల్పిస్తామన్నారు. కొత్త పే రివిజన్ ప్రకారం పెరిగిన వేతనాలు ఇవ్వడానికి రూ.375 కోట్లు పక్కనబెట్టినట్లు సీఎం వెల్లడించారు. సింగరేణి ఉద్యోగం అనుకున్నంత మంచిదికాదు. బయ్యారం ఉక్కుగనిని కూడా సింగరేణికే అప్పగిస్తమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో సీనియర్లకు అవకాశం కల్పిస్తామన్నారు. క్వార్టర్లకు ఏసీ పెట్టుకునే అవకాశం కల్పిస్తామ‌ని, దానికి ప్రీ కరెంట్ ఇస్తామ‌ని వెల్ల‌డించారు.

సింగరేణిలో పరిస్థితులు చక్కదిద్దాలని...త్వరలో సింగరేణి యాత్ర చేపడతానని సీఎం కేసీఆర్ అన్నారు. ``ప్రాంతం ఏదైనా నేనే వస్తా మీ సమ‌స్య‌లు ఏంటో తెలుసుకుంటా. మీరు చూపించుకుంటున్న ఆస్పత్రిలోనే బీపీ చెక్ చేయించుకుంటా`` అని సీఎం తెలిపారు. ఆస్పత్రుల విషయంలో కార్మికుల‌కు పూర్తి న్యాయం జరిగేటట్లు చూస్తామని సీఎం పేర్కొన్నారు. సింగ‌రేణి క్యాంటీన్లను బాగు చేస్తామ‌ని, అంబేద్కర్ జయంతి రోజు సింగరేణికి సెలవుదినం ఇస్తామ‌న్నారు. ఐఐటీ - ఐఐఎంలలో సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్లు దొరికితే ఆ ఫీజంతా కంపెనీయే భరిస్తుందని సీఎం హామీనిచ్చారు.
Tags:    

Similar News