తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు రోటీన్ కు భిన్నంగా ఉంటాయి. మరే ముఖ్యమంత్రి తీసుకోని కొన్ని నిర్ణయాల్ని ఆయన తీసుకుంటూ ఉంటారు. తాజా నిర్ణయం కూడా ఆ కోవకు చెందినదే. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక తరగతుల్ని నిర్వహించటం గడిచిన కొంతకాలంగా కేసీఆర్ చేస్తున్నారు.
ఆ మధ్యన పంచాయితీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత.. తెలంగాణలో భారీ ఎత్తున పంచాయితీల్ని సొంతం చేసుకున్న అనంతరం..కొత్తగా ఎన్నికైన వారికి శిక్షణ పేరుతో.. క్లాసులు నిర్వహించటం తెలిసిందే. ఆ సందర్భంగా వారేం చేయాలన్న అంశాన్ని దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. వందలాది మందితో కలిసి క్లాసులు తీసుకోవటం కేసీఆర్ కు కొత్త కాకున్నా.. వివిధ కారణాలతో ఇటీవల కాలంలో ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రత్యేకంగా క్లాసులు తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు.
త్వరలో ఓరియంటేషన్ క్లాసులు ఉంటాయని.. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్లాసులు తీసుకుంటారని చెబుతున్నారు. తాజాగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రెండు గంటల సేపు మాట్లాడిన గులాబీ బాస్.. వారి నియోజకవర్గాల్లో ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి? అన్న విషయాలపై దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. తన అనుభవాన్ని.. తన లక్ష్యాన్ని ఈ తరగుతుల్లో కేసీఆర్ ప్రస్తావిస్తుంటారని చెబుతారు. స్ఫూర్తిని రేకెత్తించటమే కాదు.. ఒక ప్రజాప్రతినిధి ఆలోచన విధానం ఏ తీరులో ఉండాలన్న విషయాన్ని ఆయన క్లాసులు స్పష్టం చేస్తుంటాయని చెబుతారు.