తెలంగాణ రాష్ట్ర రూపురేఖల్ని మార్చేస్తుందని అంచనా వేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ధూమ్ ధాంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్లు తెలిసిందే. కేంద్రం నిధులు తీసుకోకుండా భారీ ప్రాజెక్టును.. తక్కువ వ్యవధిలో పూర్తి చేసిన ఘనత గులాబీ బాస్ కు దక్కనుంది.
ఇదిలా ఉంటే.. ఇంత భారీ ప్రాజెక్టు రూపకర్త కేసీఆర్ పట్ల తమకున్న అభిమానాన్ని ప్రదర్శించటం కోసం భూపాలపల్లి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు వినూత్న ఆలోచన చేశారు. భారీ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాల్ని సస్యశామలం చేసే లక్ష్యంతో పూర్తి చేసిన ప్రాజెక్టు వద్ద కేసీఆర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న తలంపులో ఉన్నారు.
దీనికి సంబంధించిన విగ్రహాన్ని అల్రెడీ తయారు చేయటమే కాదు.. దానిని ఒక నేత ఇంట్లో ఉంచారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన వెంటనే ప్రాజెక్టు దగ్గర ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే.. ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పట్లో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.
తాజాగా ప్రాజెక్టు ప్రారంభం త్వరలో జరగనున్న నేపథ్యంలో విగ్రహ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. గతంలోనే తయారు చేయించిన ఈ విగ్రహం ప్రస్తుతం అంబట్ పల్లిలోని ఒక టీఆర్ఎస్ నేత ఇంట్లో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ విగ్రహాన్ని మేడిగడ్డ బ్యారేజీకి వెళ్లే మార్గంలో క్యాంపు కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విగ్రహం చుట్టూ గార్డెన్ తోపాటు.. ఇతర నిర్మాణాలను కూడా చేపట్టాలని భావిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమమేనని.. ఆ తర్వాత విగ్రహం ప్రారంభోత్సవ వేడుకను వేరుగా చేస్తారని చెబుతున్నారు. కొత్త తరహా సంప్రదాయానికి తెర తీసేలా గులాబీ నేతల ప్రయత్నాలకు గులాబీ బాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.