తెలంగాణ సచివాలయ తరలింపుపై సీఎం కేసీఆర్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ చేసిన కామెంట్లు ఇపుడు కొత్త చర్చకు తెరతీశాయి. కేసీఆర్ తన ప్రసంగంలో 'ముందు వరుసలో బుద్దుడు.... వెనుక అంబేద్కర్... తర్వాత సచివాలయం ఉండాలి' అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇంతకాలం సచివాలయ తరలింపు పేరుతో హడావిడి చేసిన సీఎం కేసీఆర్ చివరకు సచివాలయం అక్కడే ఉంటుందని తేల్చారు.
ఆరు నూరైనా సచివాలయాన్ని మారుస్తాం... అని నిన్న మొన్నటి వరకు తెలంగాణ కేసీఆర్ బల్ల గుద్ది మరీ చెప్పారు. ప్రస్తుతం ఉన్నసచివాలయంలో అన్నిహంగులు లేవు. అధికారులకు - మంత్రులకు సందర్శకులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. భయంకరమైన వాస్తుదోషం ఉందన్నారు. అందుకే నూతన సచివాలయ భవనాన్ని నిర్మించాలని చెప్పారు. ఈ మేరకు కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఎర్రగడ్డలోని చాతీ ఆసుపత్రి, మెంటల్ ఆసుపత్రిని తరలించి...అక్కడ ఉన్న వంద ఎకరాల్లో నూతన సచివాలయ భవనాలను నిర్మించనున్నట్లు చర్చ జరిగింది. సుమారు 7 నుండి 9 అంతస్థుల ఎత్తులో సచివాలయాన్ని నిర్మించాలనుకున్నారు. మంత్రులు - ఆయా మంత్రిత్వశాఖల కార్యదర్శులు హెచ్ ఓడీల కార్యాలయాలను పక్కపక్కనే నిర్మిస్తామన్నారు. నయా రాయపూర్ కంటే ఆధునాతనమైన పద్దతుల్లో భవనాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. ఈ భవన నిర్మాణ పనులకు సంబందించి ప్రముఖ డిజైనర్ హాఫీజ్ కాంట్రాక్టర్ డిజైన్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
సచివాలయ తరలింపు అంశం ఇటు అధికార వర్గాలను సైతం కలవరపాటుకు గురిచేసింది. అన్ని రకాల సౌకర్యాలు కలిగిన సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలిస్తే అనేక సమస్యలు వస్తాయని అధికారులు ఆందోళన చెందారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ స్వయంగా బుద్దుడి వెనుక అంబేద్కర్... ఆ వెనుక సచివాలయం ఉండాలంటూ... చేసిన కామెంట్స్ తో భయాలు తొలగిపోయాయని పలువురు ఉద్యోగులు అంటున్నారు. అయితే మళ్లీ కేసీఆర్ అనుకుంటే..ఈ అంశాన్ని ఎప్పుడైనా తెర మీదకు తీసుకువచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.