వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఊహించని రీతిలో బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల్ని నిశితంగా పరిశీలించిన వారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వరకూ అందరూ మహా అయితే మూడు లక్షలు.. కాదంటే కడియం శ్రీహరి మెజార్టీ వస్తుందని భావించారే కానీ.. ఇంత భారీ మెజార్టీని మాత్రం అస్సలు అనుకోలేదు. మరి.. ఇంత భారీ మెజార్టీ ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఎలాంటి వ్యూహం ఉంది? పోటాపోటీగా సాగుతుందని.. మెజార్టీ భారీగా తగ్గుతుందన్న అంచనాల నుంచి వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఎలా చేయగలిగారు? వ్యూహాల్ని పన్నటంలో సిద్ధహస్తుడైన కేసీఆర్ వరంగల్ ఉప ఎన్నికల్లో ఏం చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వరంగల్ ఉప ఎన్నికల్లో కారు తిరుగులేని అధిక్యతతో దూసుకుపోవటానికి ఏమేం కారణాలు ప్రభావితం చేశాయి? గులాబీ బాస్ వ్యూహాన్ని చూస్తే.. చాలానే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి.
= పార్లమెంటు నియోజకవర్గం మొత్తాన్ని చిన్న చిన్న జట్లగా విడగొట్టేశారు. నియోజకవర్గాన్ని మొదట అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విభజించి.. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రిని బాధ్యుడ్ని చేయటం కలిసి వచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం బాధ్యత ఆ మంత్రి మీదనే పెట్టి నడిపించారు.
= ఇక.. అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ప్రతి 60 మంది ఓటర్లకు ఒక నేతకు బాధ్యత వహించేలా ఏర్పాటు చేశారు. అలా బాధ్యత అప్పగించిన పని.. తనకు కేటాయించిన 60 మంది ఓటర్లను టీఆర్ ఎస్ కు ఓటేసేలా చూడటమే.
= ఇలా గ్రామ స్థాయి నుంచి లోక్ సభా స్థానం వరకూ పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందుకోసం ఏకంగా 5 వేల మందిని ఏర్పాటు చేశారు.
= వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి వరంగల్ కు సుపరిచితమైన వినోద్ కుమార్ ను.. కడియం శ్రీహరిలను సమన్వయకర్తలుగా ఏర్పాటు చేయటం.. వీరికి తోడుగా మంత్రి చందూలాల్.. జిల్లా పార్టీ అధ్యక్షులు తక్కెళ్ల పల్లి రవీందర్ రావులు పని చేసేలా చూశారు.
= లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించిన ఏడుగురు మంత్రులు ప్రతి మూడు రోజులకు ఒకసారి వరంగల్ లో సమావేశం కావటం. ఆయా స్థానాల ఎమ్మెల్యేల్ని.. ద్వితీయ శ్రేణి నేతల్ని కలుపుకొని ఏమేం చేయాలి? ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికారు. సమస్యలకు పరిష్కార మార్గాల కోసం ప్రయత్నించారు. పరిష్కరించలేని వాటికి సంబంధించి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
= ప్రచార సందర్భంగా నిలదీసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం.. భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా సంయమనంతో వ్యవహరించటం.. వారి సమస్యల పట్ల తాము సానుకూలంగా ఉన్నామన్నట్లుగా వ్యవహరించారు.
= పత్తికి మద్దతు ధర రాని పాపం రాష్ట్ర సర్కారు కాదు.. మొత్తం బాధ్యత కేంద్రానిది. ప్రధాని మోడీదేనన్న విషయంపై అవగాహన కల్పించటం. కేంద్రంపై కోట్లాటకు బంపర్ మెజార్టీ అవసరమన్న మాటను ఓటర్లకు అర్థమయ్యేలా చెప్పగలగటం.
= ఏ కులానికి ఆ కులంతో సమావేశాలు పెట్టటం. వారికున్న సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేస్తామని నచ్చజెప్పటం.. పార్టీ విజయానికి అండగా నిలవాలని కోరటం. ప్రచార సమయంలో కుల సంఘాలతో దాదాపుగా 65 సమావేశాలు ఏర్పాటు చేశారు.
= విపక్ష పార్టీలకి చెందిన చోటామోటా నేతల్ని పార్టీలోకి ఆహ్వానించటం.
= వరంగల్ ఉప ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో అసలేం జరుగుతుందన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తానొక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం. మంత్రుల నుంచి వచ్చే సమాచారం.. తాను ఏర్పటు చేసుకున్న వ్యవస్థ నుంచి వచ్చే సమచారాన్ని సరిపోల్చటం.. లోటుపాట్లను గుర్తించి స్వయంగా తానే సరిదిద్దే ప్రయత్నం చేయం.
= ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కనిష్ఠంగా రోజుకు 10 మందితో నేరుగా మాట్లాడేవారు. విజయానికి అవసరమైన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా చేయటం.. విజయం ఖాయమని తెలిసినా బంపర్ మెజార్టీ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎక్కడా.. ఏ చిన్న నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ ఒకే స్ఫూర్తితో నేతలు.. కార్యకర్తలు పోరాడేలా చేయటం.