ఒకే రోజు ఒకే అంశం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు మాట్లాడటాన్ని ఎప్పుడైనా చూశారా? అటు అసెంబ్లీలోనూ.. ఇటు మంత్రివర్గ సమావేశం తర్వాత కరోనా మీద సీఎం కేసీఆర్ మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. ఈ రెండు సందర్భాల్లోనూ వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ మౌనంగా ఉండిపోవటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా విషయం ఏదైనా కానీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఒకేసారి.. కాస్త సుదీర్ఘంగా అయినా కేసీఆర్ చెప్పేస్తారు. అంతేకానీ.. రెండోసారి మాట్లాడటం దాదాపుగా ఉండదు. ఇందుకు భిన్నంగా కరోనా మీద కేసీఆర్ రెండుసార్లు మాట్లాడటం చూసినప్పుడు.. దాని విషయంలో ఆయనెంత సీరియస్ గా ఉన్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు.. కరోనా సబ్జెక్టును సీఎం కేసీఆరే ఎందుకు టేకప్ చేసినట్లు? అన్న ప్రశ్నకు టీఆర్ ఎస్ వర్గాల నుంచి ఆసక్తికర సమాధానం లభిస్తుంది. విషయం ఏదైనా కానీ.. ప్రజలకు అర్థమయ్యేలా.. వారికి విషయం నేరుగా వెళ్లేలా ఉండటంతోపాటు.. అప్పుడప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి కరోనా మీద మాట్లాడారన్నప్పుడు ఉండే అటెన్షన్ వేరుగా ఉంటుంది. మిగిలిన వారు ఎంత చెప్పినా.. కేసీఆర్ మాటలకు ఉండే పవర్ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్పిన అవసరం లేదు.
కరోనా కారణంగా తీవ్రమైన భయాందోళనలతో ఉన్న తెలంగాణ ప్రజలకు మనోధైర్యాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో పాటు.. కరోనా కంగారు ఎంతమేర ఉండాలన్న విషయంపై ప్రజల్లో మరింత స్పష్టత పెంచాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ ఇష్యూను స్వయంగా డీల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మీడియా.. సోషల్ మీడియాకు మరెవరు వార్నింగ్ ఇచ్చినా అంత ప్రభావం ఉండదని.. కానీ.. కేసీఆర్ స్వయంగా చేసే హెచ్చరికల్లో ఉండే ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కారణంతోనే గడిచిన కొద్దిరోజులుగా కరోనా మీద తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడగా.. శనివారం మాత్రం అందుకు భిన్నంగా కరోనా సబ్జెక్టును తానే డీల్ చేయాలన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉందనన అభిప్రాయం వ్యక్తమవుతోంది.