మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎలాంటి నష్టాన్ని తెచ్చి పెడుతుందన్న విషయం గులాబీ నేతలకు అర్థమయ్యేలా చోటు చేసుకున్న ఉదంతం.. ఇప్పుడా పార్టీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది. ఎల్ బీ స్టేడియంలో నిర్వహించిన సభకు ఐదు వేల మంది కూడా హాజరు కాకపోవటాన్ని గులాబీ బాస్ సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
విజయం మీద ధీమా అవసరమే కానీ.. అది కాస్తా శ్రుతి మించితే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎల్ స్టేడియం సభ ఫ్రూవ్ చేసిందంటూ ఫైర్ అయిన కేసీఆర్.. గ్రేటర్ పరిధిలోని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు వరుస పెట్టి కడిగి పారేసినట్లుగా చెబుతున్నారు. సారు.. కారు.. పదహారు అంటూ ప్రచారం చేస్తున్న వేళ.. ఒక సభకు ఐదు వేల మంది కూడా హాజరు కాకపోవటం దేనికి నిదర్శనమంటూ విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా చేసింది పార్టీ నేతల మధ్య లోపించిన సమన్వయంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎల్ బీ స్టేడియం ఉదంతం తర్వాత కేసీఆర్ ఫుల్ అలెర్ట్ అయినట్లుగా సమాచారం.
నియోజకవర్గాల వారీగా రోజుకో రిపోర్ట్ తెప్పించుకునే కేసీఆర్.. మొన్నటి ఫ్లాప్ షో తర్వాత నుంచి మొత్తంగా మారినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని నాలుగు లోక్ సభ స్థానాలకు సంబంధించి గంటల వారీగా రిపోర్ట్ లు తెప్పించుకోవటం షురూ చేశారట. ఈ గంటల రిపోర్ట్ లో ఆయా లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు.. ఆయా ఎమ్మెల్యేల పని తీరును మదింపు చేస్తూ.. అలెర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రియల్ టైం ట్రాక్ చందాన.. ప్రతి గంటకో సారి తాము చేస్తున్న తప్పుల గురించి.. జరుగుతున్న పొరపాట్ల గురించి వస్తున్న సమాచారంతో గులాబీ నేతలకు గుండెలు అదిరిపోతున్నాయి. ఒక కన్నేసి ఉంచే అలవాటున్న తమ అధినేత.. ఇప్పుడు గంటల చొప్పున తమ పని తీరును మదింపు చేయటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. ఉరుకులు పరుగులు పెడుతూ.. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాకుండా ఉండేందుకు కిందా మీదా పడుతున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆరా మజాకానా?