చిత్రవిచిత్రంగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుంది. తాను కలిసేందుకు పలుమార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు ఎదురు పడిన వేళ వీహెచ్ ఏ మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కేసీఆర్ చిన్నబుచ్చుకోరు. రుసరుసలాడరు. ఎన్నిసార్లు అడిగినా అపాయింట్ మెంట్ కు నో చెప్పిన నోటితోనే.. ‘‘హన్మంతన్నా ఇంటికి పోదాం నడు’’ అంటూ ఖుషీ అయ్యే మాట అననిదే కేసీఆర్ నోరు ఊరుకోలేదు. నలుగురి మధ్యనే.. ‘‘ఏంది సీఎం సాబ్ మాకు టైమే ఇవ్వరు. కలిసేందుకు అవకాశమే ఇవ్వరు’’ అంటూ సూటిగా అడిగేశారు. నుంచి వచ్చింది. ఇదంతా పార్టీ సీనియర్ నేత.. ఒకప్పటి కాంగ్రెస్ ప్రముఖుడైన కేకే (కె. కేశవరావు) మనమడి పెళ్లి వేడుకలో చోటు చేసుకుంది.
కేసీఆర్ పై వీహెచ్ నిష్ఠూరం ఆడే వేళ.. అక్కడే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో మర్యాదపూర్వకంగా మాట్లాడిన కేసీఆర్.. వీహెచ్ తో ఇంటికి బయలుదేరారు. కేసీఆర్ వెంట.. కుటుంబ సభ్యులు ఉండటంతో.. వీహెచ్ కారు సీఎం కాన్వాయ్ లో ఆయన కారును అనుసరించింది. అనంతరం కేసీఆర్ ఇంటికి వీహెచ్ వెళ్లారు. అధికారికంగా సీన్ ఇక్కడితో కట్ అయ్యింది.
కాకుంటే.. తర్వాతేం జరిగిందన్న విషయాన్ని ఒక మీడియా సంస్థకు వీహెచ్ చెప్పటంతో విషయాలు బయటకు వచ్చాయి. ప్రగతి భవన్ కు వెళ్లిన వీహెచ్ ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించటమే కాదు.. ఆయనతో దాదాపు నలభై నిమిషాలు మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎంతో కాలంగా తాను చేసే డిమాండ్లను కేసీఆర్ ఎదుట ఏకరవు పెట్టినట్లుగా వీహెచ్ చెప్పుకొచ్చారు.
బతుకమ్మకుంటను పరిరక్షించాలన్న విషయాన్ని తాను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించిన సీఎం.. వెంటనే అడ్వొకేట్ జనరల్ కు ఫోన్ చేశారని.. జ్యోతిరావుపూలే ఆడిటోరియం.. హనుమాన్ వ్యాయామశాల విషయాల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పారు. గంట ముందు తాను కలిసేందుకు అవకాశం ఇవ్వరే అంటూ నిష్ఠూరం ఆడిన వీహెచ్.. కేసీఆర్ తో భేటీ తర్వాత.. ఆయన రియాక్ట్ అయిన తీరుకు సంతోషం వ్యక్తం చేయటం గమనార్హం. ఎలాంటి వారినైనా తన మాటలతో ఆకట్టుకోవటం కేసీఆర్ కు కుదిరినంత బాగా మరెవరికీ కుదరదేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/