వ్యవస్థనే మేనేజ్ చేస్తున్న కేసీఆర్

Update: 2018-08-26 05:31 GMT
వడ్డించేవాడు మనవాడైతే ఏమూలకు ఉన్నాఒక ముక్క ఎక్కువే పడుతుందనే నానుడి ఉంది. అది నిజమే.. వ్యవస్థలో అందరూ మనకు కొమ్ము కాయరు. కొమ్ము కాసేలా వారిని మచ్చిక చేసుకోవాలి.. తెలంగాణలో వ్యవస్థలన్నింటిని తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడంలో కేసీఆర్ విజయం సాధించారనే ప్రచారం ఉంది. అందరికంటే ముందుగా పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి, కొత్త నియామకాలు చేసి.. వారికి సకల సదుపాయాలు కల్పించి ఆ శాఖ అభిమానాన్ని కేసీఆర్ చూరగొన్నారు. అందుకే పోలీసులు ఇప్పుడు తెలంగాణలో వేగంగా స్పందిస్తున్నారు.

కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికి సిద్ధమవుతున్న వేళ రాజీనామా చేశాక కూడా తన  మాట నడిచేలా వ్యవస్థను మేనేజ్ చేయబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తనకు ఇష్టమైన.. తను చేయాలనుకుంటున్న పనులు అయ్యేలా తెలంగాణలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టబోతున్నారట.. ఇందుకోసం స్ట్రిక్ట్ ఆఫీసర్లను లూప్ హోల్స్ కు.. చెప్పిన మాట వినే అధికారులకు కీలక స్థానాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేశాక కేసీఆర్ డమ్మీ అయిపోతారు. పాలన గవర్నర్ చేతిలోకి వెళ్లిపోతుంది. గవర్నర్ అధికారులతో పనులు చేయిస్తాడు. ఈ సమయంలో తనకు తెలిసిన అధికారులుంటే కేసీఆర్ కు కొంచెం ప్లస్ అవుతుంది. అందుకే అసెంబ్లీ రద్దుకంటే ముందే తెలంగాణలో పెద్ద ఎత్తున అధికారులు, పోలీసుల బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అందరికీ బదిలీలు తప్పనిసరి చేసి కీలకమైన స్థానాల్లో తనకు ఫేవర్ చేసే వారిని నియమించుకునేందుకు బదిలీలు చేపట్టబోతున్నట్టు వార్త లీక్ అయ్యింది. ఇలా ముందస్తు ఆలోచనతో కేసీఆర్ మొత్తం వ్యవస్థలనే మానేజ్ చేసేలా ప్లాన్ చేస్తుండడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.
Tags:    

Similar News