అధికార పగ్గాలు చేపట్టిన సమయం నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ను జోరుగా కొనసాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్ను కమలంపై పడిందా? ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ తో టచ్‌లో ఉన్నారా? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. తెలంగాణలో ఉన్న ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలో ఒకరిద్దరికి గులాబీ కండువా కప్పేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ దళపతి ఎక్కుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రం..... అన్ని రాజకీయ పార్టీల మీద బ్రహ్మాండంగానే పనిచేసినా... కమలనాథుల మీద పనిచేస్తుందా? లేదా? అన్న సందేహం ఒకవైపు కలుగుతుండగా.... మరోవైపు రాష్ట్రంలో జోరుగా సాగుతోన్న పార్టీ వ్యవహారాలకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారన్న ప్రచారంతో ఆ సందేహం పటాపంచలవుతోందని చెప్పక తప్పదు.
కేసీఆర్ ఆకర్ష్ దెబ్బకు తెలంగాణలో ఇటు టీడీపీ - వైసీపీల ఉనికికే ఎసరు రాగా.. అటు కాంగ్రెస్ - సీపీఐ వంటి పార్టీల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉన్న 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది కారెక్కడంతో టీడీపీ కోలుకోని స్థితిలో ఉండగా - వైసీపీ నుంచి గెలిచిన 3 ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎంపీ టీఆర్ ఎస్ లో చేరడంతో తెలంగాణలో ఆ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ నుంచి ఎంపీ - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు ఇంకా వలసకడుతూనే ఉన్నారు. సీపీఐ నుంచి గెలిసిన ఆ ఒక్క ఎమ్మెల్యే సైతం కారెక్కడంతో కమ్యూనిస్టులు ఖంగుతిన్నారు. అధికార టీఆర్ ఎస్ పార్టీమీద ఎంత మంది ప్రతిపక్ష నేతలు ఒకవైపు దుమ్మెత్తి పోస్తూనే... మరోవైపు కోర్టుకు వెళ్తాం - ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నా వలసలను మాత్రం నియంత్రించలేక పోతున్నారన్నది వాస్తవం.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎక్కడా పెద్దగా ప్రభావం చూపకపోయినా - గ్రేటర్ లో మాత్రం ఒక ఎంపీతోపాటు 5గురు ఎమ్మెల్యేలు గెలవడంతో పార్టీ పరువు దక్కించుకుంది. అయితే బీజేపీలో ఉన్న 5 గురిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కారెక్కేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. బీజేపీకి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్ విఎస్ ఎస్ ప్రభాకర్ ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను కలవడం - రాష్ట్రంలో ఏదో ఒక చోట నిత్యం జరిగే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండడాన్ని బట్టి చూస్తుంటే.... ఆయన పార్టీ మారతున్నారన్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తోన్నారు. ఇక అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వీలైనంత త్వరలో టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం సాగుతోంది.