నమ్మశక్యం కాని వార్తలు కూడా నమ్మాల్సిన పరిస్థితి ఇప్పుడు రాజ్యమేలుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావును తప్పించనున్నారా? ఒకవారంలో ఇది అటో ఇటో తేలిపోనుంది. తెలంగాణ కేబినెట్ లో తొలి బలిపశువు దళిత మంత్రి రాజయ్య కాగా, మలి బలిపశువు హరీష్ రావు అని పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు.. కారణం ఏమీ లేదు. రాజయ్య లాగా ఆయన పాల్పడిన అవినీతి గురించి.. కేసార్ సాక్ష్యాల సహా వివరాలు సేకరించపెట్టుకోనూ లేదు. అది ఊహించలేనంత పెద్దదీ కాదు. నాయకత్వానికి భయం. హరీష్ ఎక్కడ తమను మింగేస్తాడోననే కలవరం. హరీష్ మంత్రిగా ఉంటే కేటీఆర్ ప్రాభవం ఎప్పుడూ దిగువ స్థానంలోనే ఉంటుందన్న ఆందోళన. తననూ, తన కుమారుడినీ, తన కూతురిని కూడా మించిపోతున్నాడనే ఆలోచన పార్టీ అధినేతలో ఇలాంటి ఉద్దేశాన్ని కలిగిస్తుందేమో అనుకుంటున్నారు.
రాజు కింది బంట్రోతు ఎప్పటికీ బంట్రోతులాగే ఉండాలి కానీ తోక తిప్పి రాజు కంటే గుర్తింపు పొందితే ఆ బంట్రోతు పదవికి యమగండం తప్పదు. కేసీఆర్ ఇలాకాలో ఇది నగ్నసత్యం. తన కంటే ఆధిక్యంలో ఉన్నవారిని ఎన్నడూ సహించలేని తత్వం కేసీఆర్ రక్తంలో జీర్ణించుకుపోయింది. జయశంకర్ సార్ మొదలుకుని, కోదండరామ్ వరకు తెలంగాణ సమాజంలో గుర్తింపు పొందిన ప్రతి నాయకుడిని, మేధావిని కేసీఆర్ ఎంతగా అవమానిస్తూ వచ్చారో, పని బట్టుకుని వారిని ఎలా పక్కన బెడుతూ వచ్చారో జగమెరిగిన సత్యమే.
ఇప్పుడు వంతు హరీష్ రావు దవుతోంది. ఎంత నాజూకుగా తనను తప్పించనున్నారంటే ఇప్పుడు తెరాసకు ఒక ప్రజా నేత కావాలట. గ్రామగ్రామానా ప్రజలను కదిలించి పార్టీని బలోపేతం చేయగల ఒక చరిష్మాటిక్ నేత ఆ పార్టీకి కావాలట. హరీష్ రావయితేనే అది సాధ్యమవుతుందట. అందుకని ఆయనను మంత్రి పదవినుంచి వచ్చే వారం ఊడబెరికి పార్టీని బలోపేతం చేయడానికి ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నారట. మంత్రి బాధ్యతల్లో ఉంటే పార్టీ నిర్మాణం కష్టం కాబట్టి ఆయనను తప్పించి గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేసి అన్ని స్థాయిల్లోనూ కార్యకర్తలకు జవజీవాలు కల్పించాలట.
ఇదీ కేసీఆర్ పన్నాగం. తొలి నుంచి తనకే సాధ్యమైన జిత్తులతో ఎత్తులు వేయగలిగిన కేసీఆర్ తన కళ్లముందే ఎదిగిపోతున్న అల్లుడిని ఇలా సాగనంపడానికి నిశ్చయించుకున్నారు. హరీష్‌ను తప్పించడానికి ప్రధానంగా రెండు కారణాలు. ముఖ్యమంత్రిగా తన నాయకత్వానికే హరీష్ రావు సవాలు కావచ్చు. తనయుడు, తనయల అభివృద్ధికి అడ్డంకిగా నిలబడవచ్చు. మంత్రిగా ఉంటే రాబోయే రోజుల్లో తెరాస ఎమ్మెల్యేలను కూడా చీల్చగల సామర్థ్యం ఉన్న నేత హరీష్ రావు. ఒక ప్రమాదమైతే ఎలాగోలా ఎదుర్కోవచ్చు కాని ఇన్ని ప్రమాదాలు ఒక వ్యక్తి ద్వారా జరగడానికి వీలుందంటే ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు. పాపం హరీష్..