రెండోసారి గద్దెనెక్కగానే కేసీఆర్ సీరియస్ గా ముందుకెళ్తున్నారు. పార్టీ పగ్గాలను కుమారుడికి ఇచ్చేసి ఫుల్ ఫోకస్ పాలనపై పెట్టారు. తెలంగాణ బడ్జెట్ లో సింహభాగం ఖర్చు చేస్తున్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ ఫలాలు అందితే జనాల్లో కేసీఆర్ భగీరథుడిగా మిగిలిపోతారు. దాంతోపాటు ప్రతి ఏటా ప్రాజెక్టులపై పెట్టే వ్యయం తగ్గుతుంది. అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు.
రాబోయే రెండేళ్లలో కాళేశ్వరం సహా సీతారామా - పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయగలితే.. మూడో సంవత్సరం నుంచి బడ్జెట్ లో వాటికి కేటాయింపులు చేయక్కర్లేదు. ఆ డబ్బుతో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 2024 ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్ ను గెలిపించేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.
అందుకే ఇప్పుడు కాళేశ్వరం సహా శ్రీరాంసాగర్ వెంట పడ్డారు కేసీఆర్. ఆ రెండు గోదావరిపై నిర్మించినవే.. రెండింటికి నీటి లభ్యత ఎక్కువ. తెలంగాణ కరువు తీర్చే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేసీఆర్ పార్టీ పగ్గాలను కూడా కుమారుడు కేటీఆర్ కు అప్పగించి పాలనను ఉరకలెత్తించాలని యోచిస్తున్నారు.
తెలంగాణకు అయిన అప్పులు ప్రాజెక్టులతోనే అయ్యాయి. ప్రతి బడ్జెట్ లోనూ దాదాపు 40వేల కోట్లు బడ్జెట్ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాబోయే 2020 వరకు ప్రాజెక్టులను పూర్తి చేస్తే 2021 నుంచి వాటికి బడ్జెట్ కేటాయింపులుండవు. తర్వాత వాటిపై ప్రభుత్వం తీసుకున్న అప్పుల మొత్తానికి వడ్డీ కడితే చాలు. ఆ తర్వాత మిగిలే సొమ్మంతా సంక్షేమానికే ఖర్చు చేయవచ్చు. ఈ ఆలోచనతోనే కేసీఆర్ ఇప్పుడు ప్రాజెక్టుల పూర్తినే ప్రథమ ఆశయంగా పెట్టుకున్నారు. చూడాలి మరి కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో..