దసరాకు కేసీఆర్ గుడ్ న్యూస్.?

Update: 2019-08-26 06:20 GMT
కళ్లు కాయలు కాసి పండ్లు కూడా అయిపోతున్నాయి. అయినా కేసీఆర్ కురుణించడేమీ అని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు... మంత్రి పదవులపై ఆశలు పెంచుకొని ఆశగా ఎదురుచూస్తున్నారట. ఉన్నవే ఆరు సీట్లు అందులో రెండు మహిళలకు అని కేసీఆర్ రిజర్వ్ చేశారు. ఇక రెండు కేటీఆర్, హరీష్. పోతే మిగిలేవి రెండు. ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరనేది కేసీఆర్ కు తప్ప ఆ బ్రహ్మ దేవుడికి కూడా తెలియదు.

కాగా తాజాగా టీఆర్ ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కేసీఆర్ ఈ దసరాకు మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నట్టు సమాచారం. అయితే ఒక్కరే మహిళకు మంత్రి పదవి ఇచ్చి గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రిగా చాన్స్ ఇస్తారనే ప్రచారం కూడా పార్టీలో సాగుతోంది.

ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఇద్దరినీ తప్పిస్తారనే ప్రచారం కూడా టీఆర్ఎస్ లో సాగుతోంది. కేబినెట్ లోకి నలుగురు కొత్త వారికి చాన్స్ ఇవ్వబోతున్నట్టు కేసీఆర్ సంకేతాలు ఇచ్చారట..

ఇక కేటీఆర్ - హరీష్ లను మంత్రివర్గంలోకి తీసుకుంటే వారికి పాతశాఖలే ఇస్తారా లేదా హరీష్ కు జలక్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వరా అన్న చర్చ కూడా సాగుతోంది.చూడాలి మరీ దసరాకు కేసీఆర్ ఏం చేయబోతున్నారో..?
Tags:    

Similar News