మన్ కీ బాత్...ఈ కార్యక్రమం గురించి పరిచయం అవసరం లేదు. రేడియో అనేది అటకెక్కించేచిన (ఎఫ్ఎం రేడియో మినహాయింపు) సందర్భంలో అదే రేడియో ద్వారా ప్రజలకు చేరువ అయేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపయోగించిన అద్భుతమైన కార్యక్రమం. తన మనసులోని భావాలను జనంతో పంచుకునేందుకు, దేశ ప్రజలతో సంభాషించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా మన్ కీ బాత్ చేపట్టినట్లే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా సిద్ధమయ్యారు. అయితే దీనికి తనదైన ప్రత్యేకతను జోడించనున్నారట. ఈ మేరకు ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయని తెలుస్తోంది.
మన్‌కీ బాత్‌లో ప్రధానమంత్రి తన సందేశాన్ని వినిపిస్తారు తప్ప ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పే చాన్స్ లేదు. అదే సమయంలో రేడియో కాబట్టి మోడీజీ చూసే చాన్స్ ప్రజలకు ఉండదు. కానీ కేసీఆర్ మన్ కీ బాత్ దీనికి డిఫరెంట్. తన మనసులోని భావాలను జనంతో పంచుకుంటూనే.... ప్రజా సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకునేందుకు కేసీఆర్ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని కేసీఆర్ అవలంభించనున్నారట. ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారని సమాచారం. ఇందుకు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ప్రత్యేక స్టూడియో ఏర్పాటు చేస్తున్నారని, ఆ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిసింది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు సీఎం కార్యాలయ అధికారులు సిద్ధమవుతున్నారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ప్రజలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ఆశ వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లు వంటి వారితో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నేరుగా మాట్లాడబోతున్నారు. ముందుగానే ఎంపిక చేసిన జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో వివిధ వర్గాలవారిని సమీకరిస్తారు. అనంతరం లైవ్ విధానంలో కేసీఆర్ వారితో చర్చిస్తారు. ఇలా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక జిల్లాలోని ప్రజలతో సీఎం ముఖాముఖి ఉంటుందని సమాచారం. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని చూసేలా భారీ స్థాయిలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ప్రజలు కూడా లైవ్‌లో సీఎంతో మాట్లాడడంతో పాటు వారి సమస్యలను చెప్పుకునే వీలుంటుందని, ప్రజాసమస్యలపై సీఎం వెంటనే స్పందించి అవసరమైన చర్యలకు సంబంధిత అధికారులను అక్కడిక్కడే ఆదేశిస్తారని విశ్లేషిస్తున్నారు.
భారీ బహిరంగ సభలను ఇష్టపడే కేసీఆర్ ఎందుకు ఆన్‌లైన్ ముఖాముఖి ఈ నిర్ణయానికి వచ్చారు అనే సందేహానికి ఆసక్తికరమైన సమాధానం వస్తోంది. భారీ బహిరంగ సభల కంటే ఎంపిక చేసిన వర్గాలతో ముఖాముఖి మాట్లాడటం ద్వారానే ప్రభుత్వ పనితీరును ప్రజలకు బాగా వివరించవచ్చని సీఎం కేసీఆర్ భావిస్తూ...'ఈ-క్యాంపెయిన్' ద్వారా ఎక్కువ మంది ప్రజలను చేరుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గత మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర పథకాలపై ఐదు నుంచి పది నిమిషాల నిడివిగల లఘు చిత్రాలను కూడా స్క్రీన్లపై ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ నేరుగా ప్రజలతో మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వం దగ్గరవుతుందని అధికార పార్టీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు.