మరో మార్పు చోటు చేసుకుంది. కొత్త జిల్లాలకు సంబంధించి రోజుకో కొత్త నిర్ణయాన్ని తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా.. కొత్త జిల్లాలకు సంబంధించి మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మొదట్లో అనుకున్నట్లు కాకుండా.. 31 జిల్లాల్ని ఒకేసారి.. ఒకే ముహుర్తంలో మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత రెండు జిల్లాల్ని ప్రారంభించాలని భావించిన కేసీఆర్.. అందుకు భిన్నంగా ఒకే జిల్లాను మాత్రమే ప్రారంభించాలని నిర్ణయించారు.
కొత్తగా తెర మీదకు వచ్చిన 21 జిల్లాల్ని ఏకకాలంలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. మొదట అనుకున్నప్రకారం ఒక్కోజిల్లాను ఒక్కో టైంలో ప్రారంభించాలన్నట్లుగా అనుకున్నారు. ఇందుకు తగ్గట్లే తొలుత సిద్దిపేట జిల్లాను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి మెదక్ జిల్లాను ప్రారంభించాలని భావించారు. అయితే.. అలా చేసే కన్నా.. యూనిఫాంగా ఒకేసారి ఒకే ముహుర్తంలో అన్ని కొత్త జిల్లాల్ని ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం కావటం.. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించటంతో.. కేసీఆర్ ఒక్క జిల్లాను మాత్రమే ప్రారంభించనున్నారు.
కొత్త జిల్లాల్ని ఎవరెవరు ఏయే జిల్లాల్ని ప్రారంభించాలి? జిల్లాలో ముఖ్యమైన కార్యాలయాల్ని ప్రారంభించేది ఎవరు? అన్న అంశాలపై ఒక విధానాన్ని రూపొందించటం గమనార్హం. జిల్లాల్ని ముఖ్యమంత్రి.. మంత్రులు.. సీఎస్.. స్పీకర్.. మండలి ఛైర్మన్ ప్రారంభిస్తారు. ఇక.. కొత్త జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ డివిజన్లతో పాటు.. మండలాలు.. పోలీస్ సబ్ డివిజన్.. సర్కిల్ కార్యాలయాల్ని.. పోలీస్ స్టేషన్లను ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక.. కొత్త జిల్లాలను ప్రారంభించే ముహుర్తం విషయానికి వస్తే.. దసరా రోజున ఉదయం 10 గంటల లోపునే అన్ని జిల్లాల్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇక.. జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లతో సహా మిగిలిన కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒక విధానాన్ని రూపొందించారు. తొలుత పోలీసు దళాల గౌరవ వందనం.. జాతీయ పతాకావిష్కరణ.. కలెక్టర్ బాధ్యతల స్వీకరణ.. ఆ తర్వాత కలెక్టరేట్ల ఆవరణలో బహిరంగ సభల్ని నిర్వహించటం లాంటి వాటితో కొత్త జిల్లాలు.. ఇతర కార్యాలయాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగియనున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/