కేసీఆర్ ఈటలను పక్కనపెట్టేశాడా.?

Update: 2019-09-05 05:33 GMT
అనుకున్నట్టే అయ్యింది. గులాబీ జెండాకు ఓనర్లం మేమే అని పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటల రాజేందర్ ను కేసీఆర్ దూరం పెట్టినట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంత్రి పదవి తనకు ఎవరో వేసిన భిక్ష కాదంటూ కేసీఆర్ పైనే పరోక్షంగా విమర్శలు చేసిన ఈటల రాజేందర్ ను కేసీఆర్ పక్కనపెట్టారనే చర్చ ఇప్పుడు గులాబీ దళంలో సాగుతోంది.

తాజాగా రాజేంద్రనగర్ లో కేసీఆర్ నిర్వహించిన గ్రామాల 30 రోజుల ప్రణాళిక సమావేశంలో కలెక్టర్లు మంత్రులు అంతా పాల్గొన్నారు. కలెక్టర్ల మీటింగ్ అయిపోయాక మంత్రులతో దీనిపై రివ్యూ నిర్వహించారు కేసీఆర్. కానీ ఆ సమీక్షకు ఈటల రాజేందర్ హాజరు కాలేదు. ఈటలను కేసీఆర్ ఆహ్వానించలేదని తెలిసింది. దీంతో మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది..

మరోవైపు మంత్రులంతా కేసీఆర్ సమీక్షలో ఉంటూ ఈటల మాత్రం మునుపటి కంటే యాక్టివ్ గా తెలంగాణలో జ్వరాల బారిన పడి ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించడం విశేషం..దీనిపై సెక్రెటేయట్ లో రివ్యూ కూడా నిర్వహించారు. మునుపటి కంటే జోష్ గా ఈటల కనిపించారు.

దీన్ని బట్టి తన ధిక్కార స్వరంపై ఈటల పట్టుదలగానే ఉన్నారని అర్థమవుతోంది. కేసీఆర్ సమీక్షకు పిలవకపోవడంతో ఈటలను పూర్తిగా కేసీఆర్ పక్కనపెట్టేశారన్న చర్చ సాగుతోంది. వచ్చే మంత్రివర్గంలో ఈటల ఉంటాడా? ఊడుతారా అన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో సాగుతోంది.
   

Tags:    

Similar News