మ‌రో మొక్కు తీర్చుకోనున్న‌ కేసీఆర్ !

Update: 2016-11-23 07:34 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రోమారు ఆంధ్ర‌ప్రదేశ్‌ లో అడుగుపెట్ట‌నున్నారు. క‌లియుగ దైవం మొక్కు చెల్లించుకోవడానికి ఈ నెలాఖరులో తిరుమలకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దాదాపు 5 కోట్ల విలువైన ఆభరణాలను శ్రీనివాసునికి కానుకగా సమర్పించనున్నారు. రెండు హారాలు - పద్మావతి అమ్మవారికి ఒక ముక్కు పుడకను సమర్పించి కేసీఆర్ మొక్కు చెల్లించుకోనున్నారని సమాచారం.

తెలంగా రాష్ట్రం ఏర్ప‌డితే తాను మొక్కులు చెల్లించుకుంటాన‌ని టీఆర్ ఎస్ అధినేత‌గా కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఈ మేర‌కు ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి నిధులు మంజూరు చేయించారు. అనంత‌రం వ‌రంగ‌ల్‌ లోని భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి ఆభ‌ర‌ణాలు కొద్దికాలం క్రితం స‌మ‌ర్పించుకున్నారు. తాజాగా తిరుమ‌ల వెళ్ల‌నున్నారు. 2001 తర్వాత మళ్లీ ఇప్పుడే - అంటే 15 సంవత్సరాల తర్వాత కేసీఆర్ తిరుమలకు వెళుతుండటం విశేషం. అయితే సీఎం కుటుంబ సభ్యులు శ్రీవారిని ప‌లుమార్లు దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కలను నెరవేర్చినందుకు ఆ వెంకటేశ్వరుడికి కేసీఆర్ మొక్కు చెల్లించుకోనున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా తిరుమలకు వెళతారని అధికార వ‌ర్గాలు తెలిపాయి. విజయవాడ కనకదుర్గమ్మకు కూడా ముక్కుపుడక సమర్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదిలాఉండ‌గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఒక్కసారి ఆంధ్రాకు వెళ్లారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా వెళ్లిన ఆయన తిరిగి ఈ నెలాఖరులో తిరుమ‌ల‌కు వెళ్లనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News