ఆగమాగం చేస్తున్న కరోనా వైరస్ మీద నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. పనిలో పనిగా.. కరోనా వైరస్ మీద సాగుతున్న ప్రచారం మోతాదు మించి.. విపరీతమైన భయాందోళనలకు గురి అవుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. కరోనా వైరస్ పై యుద్ధాన్ని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించటమే కాదు.. మీడియాతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు.
మామూలుగానే తనకు నచ్చని సబ్జెక్టు గురించి మాట్లాడే సమయంలో ఎంత ఘాటు వ్యాఖ్యలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది కరోనా విషయంలో సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. కరోనాపై అసత్య ప్రచారం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీని కారణంగా ప్రజలు అనవసరమైన భయాందోళనలకు గురి అవుతున్నట్లు చెప్పారు.
అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆయన.. ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికల్ని పట్టించుకోకుండా ముందుకు వెళితే ఏం జరుగుతుందో వారికే తెలుస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియా సైతం కరోనా విషయంలో సంయమనం పాటించాలన్న ఆయన.. కేవలం ఆరోగ్య శాఖ ప్రకటించిన అంశాలను మాత్రమే మీడియా ప్రజలకు తెలియజేయాలన్నారు. చాలాచోట్ల కరోనా ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ జరిపే ప్రచారంలో నిజం లేదన్నారు. సోషల్ మీడియాకు వార్నింగ్ ఇస్తూనే.. మీడియాకు పరిమితులు ఉన్నాయన్న విషయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని చెప్పాలి.