గులాబీ బాస్ కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని విన్నప్పుడు కొలత వేసిన వచ్చినట్లుగా ఉంటాయి. ఒక్క మాటలోనూ తేడా లేకుండా ఉండటమే కాదు.. ఆయన మాటల్ని వింటున్నప్పుడు.. అరెరే.. ఇంతటి విషయాన్ని మనం ఇంత లైట్ గా తీసుకున్నామా? చల్.. మనం మరింతగా ప్రయత్నం చేయాలన్న భావన కలిగేలా ఆయన మాటలు ఉంటాయి. అలాంటి కేసీఆర్.. ఈ మధ్యన తప్పటడుగులు.. తడబాటుకు గురవుతున్నారు. తాను చెప్పే మాటల్లోనే తనను వేలెత్తి చూపించే అవకాశాన్ని ఇస్తూ.. అడ్డంగా దొరికిపోతున్నారు. ఇలా చేస్తున్న ఆయన తీరు ఆశ్చర్యానికి గురవుతోంది.
తెలంగాణ రాష్ట్ర సాధనతో తాము ఉద్యమకారులం కాదని.. తామిక పూర్తిస్థాయి రాజకీయ నేతలమని.. తాము రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు కేసీఆర్. ఈ మధ్యనే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మరి..అలాంటి కేసీఆర్ తాజాగా మాట్లాడే సమయంలో తాము ఉద్యమకారులమని.. భయంకరమైన ఉద్యమాల్ని చేసి తెలంగాణను సాధించినట్లుగా ఆయన పేర్కొన్నారు.
నిజమే.. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసింది టీఆర్ఎస్ పార్టీనే అయినా.. ఆ ఉద్యమంలో కీలకభూమిక పోషించింది మాత్రం టీఆర్ఎస్ నేతల కంటే కూడా అమరవీరుల త్యాగాలే అన్నవి మర్చిపోకూడదు. వందలాది యువకులు ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాల్ని నిలువునా త్యాగం చేయటాన్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేయటంలో టీఆర్ఎస్ అధినేత పాత్రను మర్చిపోలేం. అలా అని తెలంగాణ రాష్ట్ర సాధన మొత్తానికి తానే ప్రధాన కారణమని కేసీఆర్ చెప్పుకోవటం అతిశయమే అవుతుంది.
ధాన్యం కొనుగోలు విషయంలోకేంద్రం క్లారిటీ ఇవ్వాలన్న మాటను ఉద్యమంగా తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసేందుకు తాము రాజకీయ నేతలమన్న విషయాన్ని వదిలేసి.. తాజాగా తమను తాము ఉద్యమకారులమన్న ట్యాగ్ ను తగిలించుకోవటం ఆసక్తికరంగా మారింది.అయితే.. తనను తాను ఉద్యమకారుడినన్న విషయాన్ని ఆయన చెప్పుకోవచ్చు కానీ తెలంగాణ సమాజం దాన్ని అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నను వేసుకుంటే.. అలాంటి మాటలు కేసీఆర్ నోటి నుంచి రావేమో?