ఉప ఎన్నిక గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నంద్యాలలో పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డిలతో కలసి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి విజయాన్ని వైకాపా బృందంతో పాటు ఆ పార్టీ అధినేత జగన్ కూడా అడ్డుకోలేరని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తారని, అభివృద్ధికి పట్టం కడతారని ఆయన అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ముఖ్యమంత్రికి సవాలు కానే కాదన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి ఓటర్లు భారీ విజయం చూకూర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలో పనిచేస్తున్నారని, ఇదే సమయంలో అధికారం లేకపోయినా ప్రజలను డబ్బుతో ప్రలోభాలకు గురిచేయడంతోపాటు తప్పుడు ప్రచారం చేస్తూ టిడిపిపై బురదచల్లేందుకు వైకాపా కూడా రాష్టస్థ్రాయి నాయకులను - ఎమ్మెల్యేలను - ఎమ్మెల్సీలను నంద్యాలకు పంపిందని ఆక్షేపించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలలో ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప వాస్తవానికి ఆయన ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితే లేదని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలో లేకపోయినా ప్రజలకు లెక్కలేనన్ని హామీ లు ఇస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే కొద్దిపాటి మార్పులు చేసి నవరత్నాల పేరిట తన కార్యక్రమాలను ప్లీనరీలో తెరపైకి తెచ్చారన్నారు. ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరు వేసుకొనే జగన్ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఎలా చూస్తారని ప్రశ్నించారు. అభివృద్ధిని పట్టించుకోకుండ తన స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసిన శిల్పామోహన్ రెడ్డిని నంద్యాల ప్రజలు క్షమించరన్నారు. నంద్యాలలో భూమానాగిరెడ్డి ప్రధాన హామీలు అయిన రోడ్ల విస్తరణ - తాగునీటి సౌకర్యం - 13 వేలగృహ నిర్మాణాలతోపాటు వాటికి అనుబంధంగా మరికొన్ని అభివృద్ధి పనులు చేపడుతూ రూ.1300 కోట్లు నంద్యాలకు తీసుకువస్తే ఒట్టి చేతులతో వచ్చి నంద్యాలకు వైకాపా ఏమి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.
మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక శాంతియుత వాతావరణంలో జరుగుతుందన్నారు. గోడల మీద వ్రాతలు చూసి ప్రజలు స్పందించరని - అభివృద్ధి - సంక్షేమ పథకాలకే తమ ఓటు వేస్తారన్నారు. వైకాపా తన చేతిలోని ఛానల్ - పత్రికల్లో అభూత కల్పనలతో అసత్య వార్తలతో ప్రతి రోజు ఢంకా భజాయిస్తున్నా లాభం లేదన్నారు. నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం బృందాలు, బృందాలుగా విడిపోయి ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారన్నారు. నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి చూసి వైకాపాకు కడుపు మండుతుందని, జగన్‌కు కోర్టుల్లో చుక్కెదురైనా స్థాపించిన షెల్ కంపెనీల ద్వారా జైలు పాలైనా వైకాపా నడిసముద్రంలో మునిగిపోతుందన్నారు. టిడిపిని అడ్డుకొనే శక్తి వైకాపాకు లేదన్నారు. మంత్రి ఆది మాట్లాడుతూ వైకాపా నంద్యాలలో ఎలాగైనా జరుగుతున్న అభివృద్ధి పనులు ఆపివేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం శిల్పాను బరిలోకి దింపిందే తప్ప వారికి నిరాశ తప్పదన్నారు. మంచి అన్నది పెంచుమన్న అని గురజాడ అంటే వైకాపా మాత్రం మంచిని తెంచుమన్న అంటూ ప్రచారం చేయడం దారుణమన్నారు. నంద్యాలను అభివృద్ధి చేయరాదా? చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీవి అభివృద్ధి ప్రకటనలు అయితే, వైకాపావి ఉత్తుత్తి ప్రకటనలే అన్నారు. నంద్యాలలో పోటీ పెట్టాలా? లేదా? అన్న విషయం వైకాపాకే వదిలి వేస్తున్నామని, 2019 ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి విజయం సాధించి నాంది పలుకుతుందన్నారు.