ఆ సీఎం ఫోర్‌ బెడ్‌రూం ఫ్లాట్‌లో నో ఏసీ

Update: 2015-03-18 05:00 GMT
పేరుకు పార్టీ అధినేత అయినప్పటికీ చిన్న ఇంట్లో ఉంటూ సర్దుకుపోతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. పెద్ద ఇంట్లోకి మారటం తెలిసిందే. మారిన అవసరాల దృష్ట్యా ఆయనిప్పుడు ఫోర్‌ బెడ్‌రూం హౌస్‌లోకి మారుతున్నారు.

తాను సామాన్యుడినని చెప్పుకునే ఆయనకు.. ఫోర్‌బెడ్‌రూమ్స్‌.. రెండు లాన్లు.. రెండు సర్వెంట్‌ క్వార్టర్లు ఉన్న నివాసం ఎందుకన్న విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్‌ మీడియాలో కేజ్రీ ఇంటి వ్యవహారంపై జోకులు చాలానే వైరల్‌ అవుతున్నాయి.

మరి.. ఈ విషయాన్ని గుర్తించినట్లున్నారో ఏమో కానీ.. ఆయనిప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. కొత్తగా తీసుకున్న ఇంట్లో ఉన్న ఏసీల్ని తొలగించాలని అదికారారుల్ని ఆదేశించారంట. ఒక్క ఏసీ కూడా ఉండకూడదని తేల్చి చెప్పారంట. ఏసీలు విలాసవంతమైన జీవితాన్ని ప్రతీకలుగా భావించే కేజ్రీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు.

ఏసీలు తీసేయటం వల్ల పెద్దపెద్ద రంధ్రాలు పడతాయని.. ఎబ్బెట్టుగా ఉంటుందన్న అధికారుల మాటకు.. ఆ స్థానంలో కిటికీలు ఏర్పాటు చేయమన్నారంట. ఏసీ ఉండే విషయంలో ససేమిరా అనటం ద్వారా.. తానెంత సింఫుల్‌ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేందుకు కేజ్రీ ట్రై చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి సామాన్యుడి ఇంట్లో ఏసీ అనేది ఉండదన్న మాట.
Tags:    

Similar News