ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఒకప్పటి ఆయన మంత్రివర్గంలో సభ్యుడు.. ప్రస్తుతం ఆప్ బహిష్కృత నేతగా ఉన్న కపిల్ మిశ్రా చేసిన సంచలన ఆరోపణలు సృష్టిస్తున్న కలకలం అంతాఇంతా కాదు. కేజ్రీవాల్ అవినీతి బహిర్గతమైందని.. షెల్ కంపెనీల్ని ఏర్పాటు చేసి భారీగా నిధులు పోగేశారన్న మాటతో పాటు.. పలు అవినీతి ఆరోపణలు చేయటం తెలిసిందే.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ అవినీతి బయటపడిందని.. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయటమే కాదు.. ఒకవేళ అలా చేయకుంటే.. ఈడ్చుకెళ్లి తీహార్ జైల్లో పడేస్తానంటూ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ సతీమణి తీవ్రంగా స్పందించారు. అబద్ధపు ఆరోపణలు చేసిన మిశ్రా భవిష్యత్ పరిణామాలకు బాధ్యత వహించాలన్నారు.
కపిల్ మాటలన్నీ నమ్మక ధ్రోహంలో నుంచి పుట్టినవేనని.. అన్నీ తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేసిన ఆమె.. ప్రకృతి ధర్మం ఎప్పుడూ తప్పు కాదన్నారు. జరగబోయే పరిణామాలకు అతడు బాధ్యత వహిస్తాడా? అంటూ ఆమె ట్వీట్ చేశారు ఆప్ లో ఏం జరిగినా.. పట్టించుకోనట్లుగా ఉండే కేజ్రీవాల్ సతీమణి.. తన తీరుకు భిన్నంగా రియాక్ట్ కావటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.